Toyoto Urban Cruiser Hyryder Aero Edition: టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (TKM) తన ప్రసిద్ధ SUV అర్బన్ క్రూయిసర్ హైరైడెర్ కోసం కొత్త ఏరో ఎడిషన్ (లిమిటెడ్ ఎడిషన్) స్టైలింగ్ ప్యాకేజీని అధికారికంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా టొయోటా డీలర్‌షిప్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. Aero Edition SUV వైట్, సిల్వర్, బ్లాక్, రెడ్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. Aero Edition SUVకి బోల్డ్, స్పోర్టీ లుక్‌ను అందించడానికి ప్రత్యేక ఫీచర్లు డిజైన్ చేయబడ్డాయి. ఫ్రంట్ స్పాయిలర్ SUVకి షార్పెర్, అగ్రెసివ్ స్టాన్స్ ఇస్తుంది. రియర్ స్పాయిలర్ స్పోర్టీ లుక్‌ను పెంపొందిస్తుంది.. అలాగే ఆర్డినామిక్ సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కొత్త సైడ్ స్కర్ట్స్ SUVకి డైనమిక్, లో-స్లంగ్ ప్రొఫైల్ ఇస్తాయి. ఇవి ప్రీమియం, పనితీరు, లుక్‌ను హైలైట్ చేస్తాయి.
Diwali 2025 Festival Date: కన్‌ఫ్యూజన్‌లో జనాలు.. దీపావళి పండగ ఏ తేదీనో తెలుసా?
అర్బన్ క్రూయిసర్ హైరైడెర్ ధర రూ.10.94 లక్షల నుండి ప్రారంభమవుతుంది (ఎక్స్-షోరూం). ఈ SUV రెండు పవర్‌ట్రెయిన్లలో లభిస్తుంది. సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ (HEV) మోడల్ కారు e-డ్రైవ్ ట్రాన్స్మిషన్ ద్వారా SUVని 40% దూరం, 60% సమయం ఎలక్ట్రిక్ పవర్‌లో నడిపిస్తుంది. ఇంజిన్ షట్ ఆఫ్ ఫీచర్‌తో 27.97 km/l మైలేజ్ అందిస్తుంది. ఇక Neo Drive ఎడిషన్ కారులో 1.5 లీటర్ K-సిరీస్ ఇంజిన్, ఫైవ్ స్పీడ్ మాన్యువల్, సిక్స్ స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్, 2WD అండ్ 4WD ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
గేమింగ్ ఫోన్లలో గేమ్‌చేంజర్ ఆగయా.. REDMAGIC 11 Pro, 11 Pro+ లాంచ్..!
Hyryder SUV ఎక్స్‌టీరియర్‌లో క్రిస్టల్ అక్రిలిక్ గ్రిల్, సిగ్నేచర్ ట్విన్ LED DRLs, 17 అంగుళాల అలాయ్ వీల్స్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో వెంటిలేటెడ్ లెదర్ సీట్స్, పానోరామిక్ సన్‌రూఫ్, 9 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, అంబియంట్ లైటింగ్, 360 డిగ్రీ కెమెరా వంటి సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ SUVలో రిఅర్ రీక్లైన్ సీట్స్, రియర్ AC వెంట్స్, USB ఛార్జింగ్, 60:40 స్ప్లిట్ రియర్ సీట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి SUVని ఆధునిక భారతీయ కుటుంబాల అవసరాలకు అనుగుణంగా చేస్తాయి. టొయోటా 66 ప్రత్యేక ఆక్సెసరీస్, 3 సంవత్సరాలు లేదా 1,00,000 కి.మీ. హైబ్రిడ్ బ్యాటరీ వారెంటీ ద్వారా యజమాన్య అనుభవాన్ని మరింత ఎలివేట్ చేస్తుంది. ఈ Aero Edition Urban Cruiser Hyryder, స్టైలింగ్, పనితీరు, సౌకర్యాల సమ్మేళనం ద్వారా SUV ఆటోమొబైల్ లవర్స్ కు ఒక మంచి ఎంపికగా నిలుస్తుంది.
