Site icon NTV Telugu

Toyota Mirai: జీరో ఎమిషన్ టెక్నాలజీతో టయోటా మిరాయ్.. 650 కి.మీ రన్‌తో రికార్డ్!

Tayota

Tayota

Toyota Mirai: టయోటా కిర్లోస్కర్ మోటార్ తన సెకండ్ జనరేషన్ హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ ‘మిరాయ్‌’ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (NISE)కి అప్పజేప్పింది. భారతదేశంలోని వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఇదెలా వర్క్ చేస్తుందనే విషయాన్ని పరిశీలించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచంలోని మోస్ట్ అడ్వాన్స్డ్ జీరో ఎమిషన్ వెహికిల్స్ లో టయోటా మిరాయ్ ఒకటి. ఈ కారు హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ మధ్య జరిగిన రసాయన చర్యతో ఏర్పడిన విద్యుత్తు ద్వారా పని చేయనుంది. నీటి ఆవిరిని మాత్రమే రిలీజ్ చేస్తుంది. ఇది సుమారు 650 కిలో మీటర్ల దూరం మైలేజ్ ఇస్తుందని టాక్. ఇదే నిజమైతే.. సాధారణ ఫ్యూయెల్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లకు ఇది ప్రత్యామ్నాయంగా మారనుంది.

Read Also: CM Chandrababu: నేడు విశాఖకు సీఎం చంద్రబాబు.. 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన..

అయితే, కంపెనీ కూడా ఈ లేటెస్ట్ టయోటా మిరాయ్ కారును.. ఇంధన సామర్థ్యం, ​​పరిధి, డ్రైవింగ్ సామర్థ్యం, ఇండియాలో విభిన్న భూభాగాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా తయారు దీన్ని రూపొందించింది. ఈ కారు టెస్టింగ్ పూర్తైన తరువాత.. అన్నింటా విజయం సాధిస్తే.. త్వరలోనే రోడ్లపైకి రానుంది. భారతదేశ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ & కార్బన్-న్యూట్రాలిటీ టార్గెట్ ను బలోపేతం చేస్తూ.. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని TKM & NISE మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత.. కారును టెస్టింగ్ కోసం అప్పగించింది.

Exit mobile version