బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
- టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడెర్లో Aero Black Edition
- భారత మార్కెట్లో విడుదల..
- Aero Black స్టైలింగ్ ప్యాకేజీ ధర రూ.31,999..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toyota Hyryder Aero Black Edition: టయోటా ఇండియా (Toyota) కంపెనీ పాపులర్ ఎస్యూవీ అర్బన్ క్రూయిసర్ హైరైడెర్ లో సరికొత్త ఏరో బ్లాక్ ఎడిషన్ (Aero Black Edition)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్‌లో భాగంగా ఎస్‌యూవీకి ప్రత్యేకమైన బ్లాక్-థీమ్ డిజైన్‌ను అందించారు. పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండే ఈ స్టైలింగ్ ప్యాకేజీ ధర రూ.31,999గా నిర్ణయించారు. స్టాక్ ఉన్నంత వరకు టయోటా డీలర్‌షిప్‌ల ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు.
బ్లాక్ థీమ్.. కొత్త లుక్..
ఈ బ్లాక్ ఎడిషన్‌లో ప్రధానంగా ఎక్స్టీరియర్ డిజైన్‌లో మార్పులు చేశారు. సాధారణ మోడల్లో క్రోమ్ ఫినిషింగ్‌తో కనిపించే పలు భాగాలను ఇప్పుడు బ్లాక్ కలర్లోకి మార్చారు. ఇందులో అప్పర్ గ్రిల్ గార్నిష్, హెడ్‌ల్యాంప్ సరౌండ్స్, టెయిల్‌గేట్ ట్రిమ్ ఉన్నాయి. అలాగే ముందు బంపర్ దిగువ భాగంలో ఉండే సిల్వర్ ఫినిష్డ్ సెక్షన్‌కు కూడా బ్లాక్ వేరియెంట్ ఇచ్చారు. ఫ్రంట్, రియర్ స్పాయిలర్లను కూడా బ్లాక్ కలర్లో అందించారు. ప్రత్యేకంగా ఈ ఎడిషన్‌ను గుర్తించేందుకు “ఏరో బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్” బ్యాడ్జ్‌ను కూడా అమర్చారు.
Also Read
- రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
- Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
- Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
- Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
ఆల్ బ్లాక్ ప్యాకేజీ:
మరింత ప్రత్యేకమైన లుక్ కావాలనుకునే కస్టమర్ల కోసం టయోటా మరో “ఆల్ బ్లాక్ ప్యాకేజీ”ను కూడా అందిస్తోంది. అయితే ఇది ఏరో బ్లాక్ ఎడిషన్ స్టైలింగ్ ప్యాకేజీకి అదనంగా డీలర్ స్థాయిలో అందించే ప్రత్యేక ఆప్షన్. దీని ధర వేరుగా ఉంటుంది.
ఇంజిన్‌లో మార్పులు:
ఈ ఎడిషన్‌లో కేవలం డిజైన్ మార్పులు మాత్రమే చేశారు. ఎస్యూవీ ఇంజిన్, సస్పెన్షన్ లేదా గేర్‌బాక్స్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. పెట్రోల్ వెర్షన్లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 103hp పవర్, 137Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. కొన్ని వేరియంట్లలో 2WDతో పాటు AWD ఆప్షన్ కూడా లభిస్తుంది.
దీనిని నియో డ్రైవ్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్ట్రెయిన్లతో అందిస్తున్నారు. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్లో 1.5 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ సిస్టమ్ మొత్తం 115hp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 0.60kWh లిథియం-అయాన్ బ్యాటరీ, e-CVT గేర్‌బాక్స్ ఉంటాయి. పవర్ ముందు చక్రాలకు అందుతుంది. అయితే ఏరో బ్లాక్ ఎడిషన్‌లో CNG పవర్‌ట్రెయిన్ అందుబాటులో ఉండదని టయోటా తెలిపింది.
ధర:
టొయోట అర్బన్ క్రూయిసర్ హైరైడెర్ ఏరో బ్లాక్ ఎడిషన్ ను కేవలం మిడ్ నైట్ బ్లాక్ ఎక్స్టీరియర్ కలర్లో అందిస్తున్నారు. ఇది G(O), V గ్రేడ్లలో లభిస్తుంది. G(O) Neo Drive వేరియంట్ సాధారణంగా రూ.14.87 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఏరో బ్లాక్ ప్యాకేజీతో దీని ధర రూ.15.19 లక్షలకు చేరుతుంది. అదేవిధంగా V వేరియంట్ సాధారణ ధర రూ.16.42 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, ఏరో బ్లాక్ ప్యాకేజీతో రూ.16.74 లక్షలకు చేరుతుంది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
-
Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
-
Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!