NTV Telugu Site icon

Top Selling SUVs: ఇండియాలో టాప్ సెల్లింగ్ ఎస్ యూ వీ కార్లు ఏవో తెలుసా..?

Suvs

Suvs

దేశంలో కార్ల అమ్మకాలు బాగానే పుంజుకుంటున్నాయి. అయితే వీటిలో కాంపాక్ట్ ఎస్ యూ వీలకు డిమాండ్ ఏర్పడింది. హ్యచ్ బ్యాక్ సేల్స్ ను కూడా అధిగమించేలా కాంపాక్ట్ ఎస్ యూ వీల సేల్స్ ఉన్నాయి. హ్యచ్ బ్యాక్ కార్లు వచ్చే ధరలకే కాంపాక్ట్ ఎస్ యూ వీ కార్లు వస్తుండటంతో వినియోగదారులు వీటిని కొనేందుకే మొగ్గు చూపిస్తున్నారు. పలు కార్ల కంపెనీలు కూడా ఎస్ యూ వీ సెగ్మెంట్ లలో కొత్త కార్లను తీసుకువస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఇండియాలో ఎస్ యూ వీ కార్ల అమ్మకాలు పెరిగాయి. అయితే ఇందులో కొన్నింటిని విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు వినియోగదారులు. ఇండియాలో టాప్ సెల్లింగ్ ఎస్ యూ వీల జాబితాలో మొదటిస్థానంలో ఉంది టాటా నెక్సాన్. ఆ తరువాతి స్థానాల్లో మారుతి సుజుకీ విటారా బ్రేజా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎస్ యూ వీ 300 ఉన్నాయి.

ఈ ఏడాది ఎప్రిల్ అమ్మకాలను పరిశీలిస్తే… టాటా నెక్సాన్ 13,471 యూనిట్లు అమ్ముడుపోయాయి. టాటా సేఫ్టిీ పరంగా నెక్సాన్ ను స్ట్రాంగ్ బాడీతో బిల్డ్ చేసింది. దీంతో వినియోగదారులు ఈ కారును ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో నెక్సాన్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. మారుతి సుజుకీ విటారా బ్రేజా 11,764 యూనిట్లు, హ్యుందాయ్ వెన్యూ 8,392, కియా సోనెట్ 5,404 యూనిట్లు, మహీంద్రా ఎస్ యూ వీ 300 3,909 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం టాప్ 5లో సేల్లింగ్స్ లో ఈ కార్లే ఉన్నాయి.