Best Bikes: బడ్జెట్ ధరలో.. రోజువారీ ప్రయాణానికి బెస్ట్ బైక్స్..
- రోజువారీ ప్రయాణానికి బెస్ట్ బైక్స్
- బడ్జెట్లో కమ్యూటర్, స్పోర్టీ సెగ్మెంట్లలో కొన్ని బైక్‌లు
- హోండా షైన్ 125
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజువారీ ప్రయాణం కోసం తక్కువ ధరలో మంచి మైలేజ్, నమ్మకమైన పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చులు కలిగిన బైక్ కోసం చూస్తున్న వారికి మార్కెట్లో అనేక మంచి బైక్స్ అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్లో కమ్యూటర్, స్పోర్టీ సెగ్మెంట్లలో కొన్ని బైక్‌లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. వాటిలో టాప్ 5 మోడళ్ల వివరాలు ఇవే.
1. బజాజ్ ప్లాటినా 110
బజాజ్ ప్లాటినా 110 తక్కువ ధరలో అధిక మైలేజ్ కోరుకునే వారికి మంచి ఎంపికగా నిలుస్తోంది. ఇందులో 115.45 సీసీ ఇంజన్ ఉండి 8.6 హెచ్‌పీ పవర్, 9.81 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్ సుమారు 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. సౌకర్యవంతమైన సస్పెన్షన్ కారణంగా గ్రామీణ ప్రాంత రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణించవచ్చు. దీని ప్రారంభ ధర సుమారు రూ.72,428.
Also Read
- Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
- Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారు..!
- BYD Denza Z9 GT: భారత్‌లోకి BYD లగ్జరీ ఎలక్ట్రిక్ కారు Denza Z9 GT.. 1,156 PS పవర్, 599KM రేంజ్..!
- Tata Safari EV: టాటా సఫారీ EV వచ్చేస్తోంది.. మహీంద్రా XEV 9Sకు గట్టి పోటీ!
2. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్
టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్‌లలో ఒకటి. 109.7 సీసీ ఇంజన్‌తో పనిచేసే ఈ బైక్ 8.1 హెచ్‌పీ పవర్, 8.7 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 67 నుంచి 83 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగల సామర్థ్యం దీని ప్రత్యేకత. LED హెడ్‌లైట్, USB ఛార్జింగ్ పోర్ట్, ఎకో ఇండికేటర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధర రూ.75, 200 నుంచి ప్రారంభమవుతుంది.
3. హోండా షైన్ 125
125 సీసీ సెగ్మెంట్లో అత్యంత నమ్మకమైన బైక్‌లలో హోండా షైన్ ఒకటి. 123.9 సీసీ ఇంజన్‌తో పనిచేసే ఈ బైక్ 10.5 హెచ్‌పీ పవర్, 11 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 55 నుంచి 65 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. డిజిటల్ డిస్ప్లే, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.85,862 నుంచి ప్రారంభమవుతుంది.
4. హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్
హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ ఫీచర్ల పరంగా మంచి విలువను అందించే బైక్. 124.7 సీసీ ఇంజన్, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్ రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. 60 నుంచి 65 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ మీటర్, LED హెడ్‌లైట్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర సుమారు రూ.88,044 నుంచి ప్రారంభమవుతుంది.
5. బజాజ్ పల్సర్ 125
స్పోర్టీ లుక్‌తో పాటు మంచి పనితీరు కోరుకునే వారికి బజాజ్ పల్సర్ 125 మంచి ఎంపిక. 124.4 సీసీ ఇంజన్‌తో పనిచేసే ఈ బైక్ శక్తివంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. 50 నుంచి 55 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్, కంఫర్టబుల్ రైడింగ్ పొజిషన్ దీని ప్రత్యేకతలు. దీని ప్రారంభ ధర రూ.91,757.
తాజావార్తలు
-
Telangana Food Safety: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. 9 సంస్థల లైసెన్సులు రద్దు..
-
PM Kisan 24th Installment Out: పీఎం కిసాన్ 24వ విడత విడుదల.. మీ ఖాతాలో రూ.2,000 పడ్డాయా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
-
IND vs NZ 4th T20: వైభవ్, భువనేశ్వర్ అవుట్.. జట్టులోకి వచ్చిన ఆ ఇద్దరు.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
-
AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!