ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Tiago 2026 Launched in India at Rs 4.69 Lakh: టాటా మోటార్స్ తన అత్యంత చౌకైన, చిన్న కారు అయిన ‘టియాగో’ (Tiago) సరికొత్త 2026 అవతారాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. పెట్రోల్, సీఎన్జీ (CNG), ఈవీ (EV) పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో వస్తున్న ఈ సెగ్మెంట్లోని ఏకైక కారు ఇదే కావడం విశేషం. పాత టియాగో ప్రారంభ ధర రూ.4.6 లక్షలుగా ఉండగా, ఈ సరికొత్త మోడల్ బేస్ వేరియంట్ ధరను సైతం కంపెనీ రూ.5 లక్షల లోపే ఉంచుతూ ప్రారంభ ధరను రూ.4.69 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. కాగా పెట్రోల్ టాప్ వేరియంట్ ధర రూ.7.29 లక్షలు, సీఎన్జీ వేరియంట్ల ధరలు రూ.5.79 లక్షల నుంచి రూ.7.99 లక్షల వరకు ఉన్నాయి. అలాగే కొత్త టాటా టియాగో ఈవీ (EV) ప్రారంభ ధరను రూ.6.99 లక్షలుగా నిర్ణయించగా, బ్యాటరీని అద్దెకు తీసుకునే ‘BaaS’ (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్) విధానం ద్వారా దీనిని మరింత తక్కువగా రూ.4.69 లక్షల ప్రారంభ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఈ సరికొత్త కారును మునుపటి కంటే చాలా సురక్షితంగా తీర్చిదిద్దినట్లు లాంచ్ ఈవెంట్లో టాటా మోటార్స్ పేర్కొంది. ఒకవేళ రియల్ వరల్డ్‌లో ప్రమాదం జరిగితే కారు ఎలా తట్టుకుంటుందో చూపించడానికి ఒక ‘డ్యూయల్ ఇంపాక్ట్ యాక్సిడెంట్’ డెమోను సైతం కంపెనీ ప్రదర్శించింది. భద్రత కోసం కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా ఇవ్వడంతో పాటు, బాడీ తయారీలో హై-స్ట్రెంత్ మెటీరియల్‌ను ఉపయోగించారు. గుంతల రోడ్లపై సైతం సులువుగా ప్రయాణించేలా దీనిని డిజైన్ చేశారు. కారు లోపల బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉండగా, ఏఎమ్‌టి (AMT) వెర్షన్లో డ్రైవింగ్ కాన్ఫిడెన్స్ పెంచేందుకు వీలుగా ప్యాడల్ షిఫ్టర్లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను అందించారు.
Also Read
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ముఖ్యంగా టాటా టియాగో ఈవీ (EV) లో కస్టమర్ల మైలేజ్ (రేంజ్) ఆందోళనలను దూరం చేసేలా కంపెనీ కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా ఈవీ బ్యాటరీపై ఏకంగా ‘లైఫ్‌టైమ్ వారంటీ’ని ప్రకటిస్తూ, కేవలం 30 నిమిషాల్లోనే కారును ఛార్జ్ చేసుకునేలా మల్టిపుల్ ఛార్జింగ్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇక ఇంజిన్ విషయానికొస్తే.. కొత్త టియాగోలో 1.2 లీటర్, త్రీ-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది పెట్రోల్ మోడల్లో 86 హెచ్‌పి (HP) పవర్‌ను, సీఎన్జీ మోడల్లో 75.5 హెచ్‌పి పవర్‌ను జనరేట్ చేస్తుంది. త్రీ-సిలిండర్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తున్న ఈ కారు.. మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి వ్యాగన్ఆర్, సెలెరియో, హ్యుందాయ్ ఐ10 (i10) కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!