Site icon NTV Telugu

Tata Sierra Hyperion vs Hyundai Creta N Line: పోటాపోటీగా సియెర్రా, క్రెటా.. కాని సియెర్రా ఒక్కటి తక్కువైంది!

Tata Sierra Turbo Petrol Vs Hyundai Creta

Tata Sierra Turbo Petrol Vs Hyundai Creta

Tata Sierra Hyperion vs Hyundai Creta N Line: టాటా మోటార్స్ తాజాగా సియెర్రా ఎస్‌యూవీని విడుదల చేసింది. దీని ధరలు రూ. 11.49 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతున్నాయి. ఈ మోడల్‌తో పాటు కొత్త 1.5 లీటర్ హైపీరియన్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కూడా పరిచయం చేసింది. ఈ కారణంగా టాటా సియెర్రా ఇప్పుడు ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్‌కు పోటీగా నిలుస్తోంది. రెండు కార్లు మంచి పనితీరు ఇవ్వడమే కాకుండా, ధర పరంగా కూడా పోటీపడుతున్నాయి. ఇంజిన్ పవర్ దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ.. టార్క్, గేర్‌బాక్స్ విషయంలో మాత్రం తేడాలు ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ స్పోర్టీ లుక్‌తో పాటు మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కూడా అందించడం వల్ల ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది.

READ MORE: IPL 2026 Auction: ఐపీఎల్‌ వేలంలో 39 ఏళ్ల స్పిన్నర్.. పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు!

టాటా సియెర్రాలో ఉన్న 1.5 లీటర్ టీజీడీఐ హైపీరియన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ నాలుగు సిలిండర్లతో 1498 సీసీ సామర్థ్యం కలిగి ఉంది. ఇది 5,000 ఆర్‌పీఎమ్ వద్ద గరిష్టంగా 160 పీఎస్ పవర్‌ను ఇస్తుంది. అలాగే 1,750 నుంచి 4,000 ఆర్‌పీఎమ్ మధ్య 255 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ (6AT) జత చేశారు. టాటా సియెర్రా అడ్వెంచర్ ప్లస్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ ప్లస్ వేరియంట్లలో ఈ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. వీటి ధరల విషయానికి వస్తే.. అడ్వెంచర్ ప్లస్ వేరియంట్ ధర రూ. 17.99 లక్షలు, అకాంప్లిష్డ్ వేరియంట్ ధర రూ. 19.99 లక్షలు, అకాంప్లిష్డ్ ప్లస్ వేరియంట్ ధర రూ. 20.99 లక్షలు (అన్ని ఎక్స్-షోరూమ్ ధరలు). ఇక హ్యుందాయ్ క్రెటాలో టర్బో పెట్రోల్ ఇంజిన్ ‘కింగ్’ వేరియంట్‌లో లభిస్తుంది. దీని ధర రూ. 19.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). అలాగే హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ కూడా టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉండగా, దీని ప్రారంభ ధర రూ. 17.82 లక్షలు (ఎక్స్-షోరూమ్).

READ MORE: Jio Recharge Plan: జియో యూజర్స్‌కు గుడ్ న్యూస్.. కేవలం రూ.103తో 28 రోజులు!

Exit mobile version