Tata Sierra 7-Seater: టాటా మోటార్స్(Tata Motors) తన కొత్త సియెర్రా (Sierra) SUVతో సంచలనాలు క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది. కొత్త బాక్సీ డిజైన్‌తో అట్రాక్ట్ చేస్తోంది. డీజిల్, పెట్రోల్ వేరియంట్లతో పాటు ఈవీ వేరియంట్‌లో కూడా సియెర్రా రాబోతోంది. ఇప్పటికే రూ. 11.49 లక్షల (ఎక్స్-షోరూం) ధరతో బేస్ వేరియంట్‌ను అందిస్తోంది. అగ్రేసివ్ ధరతో వస్తుండటంతో ప్రత్యర్థి కార్ మేకర్స్ కూడా హైరానా పడుతున్నాయి. 5-సీటర్‌గా వస్తున్న ఈ సియోర్రాలో అత్యాధుని ఫీచర్లతో పాటు హై స్టాండర్డ్ సేఫ్టీని టాటా అందిస్తోంది. సియోర్రా, కర్వ్-హారియర్ మధ్య కేటగిరిలోకి వచ్చే మిడ్ సైజ్ ఎస్‌యూవీగా ఉంటుంది.
Read Also: Mallika Sagar: WPL వేలంలో స్పెషల్ అట్రాక్షన్‌గా మల్లికా సాగర్.. ఇంతకీ ఎవరు ఈమే!
ఇదిలా ఉంటే, టాటా మరో సంచలనానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సియెర్రా లైనప్‌లో 7-సీటర్‌ను కూడా తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సియెర్రా పొడవైన వీల్ బేస్, మాడ్యులర్ ఆర్కిటెక్చర్ వల్ల పెద్దగా మార్పులు లేకుండా 7-సీటర్ కాన్ఫిగరేషన్ సాధ్యమవుతుంది. మెరుగైన ట్రాక్షన్, ఆఫ్ రోడ్ సామర్థ్యాలను కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, సియెర్రాను ఆల్-వీల్ డ్రైవ్‌గా తీసుకురావాలని టాటా యోచిస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ సియెర్రా(EV)ని ఆల్-వీల్ డ్రైవ్‌లో తెస్తోంది. ICE ఇంజన్ AWD వేరియంట్ 2027 ప్రారంభంలో తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా సియెర్రాను CNGలో కూడా తీసుకురావాలని భావిస్తోంది. ARGOS ప్లాట్‌ఫామ్ (ఆల్-టెర్రైన్ రెడీ, ఓమ్ని-ఎనర్జీ మరియు జామెట్రీ స్కేలబుల్ ఆర్కిటెక్చర్)పై సియెర్రా నిర్మితమైంది. ఇది సీఎన్‌జీ, ఈవీ కాన్ఫిగరేషన్‌కు మద్దతు ఇస్తుంది.
