Tata Sierra Dark: టాటా మోటార్స్ భారత మార్కెట్లో సియెర్రా డార్క్ (Tata Sierra Dark) ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ మధ్య మార్కెట్లోకి వచ్చిన మధ్యతరహా ఎస్‌యూవీ సియెర్రాకు ఈ కొత్త ఎడిషన్‌లో పూర్తిగా నలుపు రంగు థీమ్‌ను అందించారు. ఫ్రీజియన్ బ్లాక్ ఎక్స్‌టీరియర్, సాటిన్ మిడ్‌నైట్ బ్లాక్ అంశాలు, డార్క్ క్రోమ్ వివరాలు, నలుపు రంగు అల్లాయ్ వీల్స్ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.
సియెర్రా డార్క్ ఎడిషన్ ప్రామాణిక సియెర్రా డిజైన్‌నే కొనసాగిస్తూ.. మరింత డార్క్ లుక్‌తో వస్తుంది. ఫ్రీజియన్ బ్లాక్ బాడీ కలర్‌తో పాటు ముందు, వెనుక బంపర్ స్కిడ్ ప్లేట్లకు సాటిన్ మిడ్‌నైట్ బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌కు జెట్ పియానో బ్లాక్, డైమండ్-కట్ డిజైన్, టింటెడ్ బ్లాక్ లాకర్ ఫినిష్ ఉన్నాయి. ముందు, వెనుక భాగాల్లో పియానో బ్లాక్, డార్క్ క్రోమ్ టాటా లోగోలు ఉన్నాయి. గ్రిల్‌పై డార్క్ క్రోమ్ సియెర్రా బ్యాడ్జ్, ముందు డోర్లు, టెయిల్‌గేట్‌పై డార్క్ క్రోమ్, పియానో బ్లాక్ సియెర్రా మాస్కాట్స్ ఇచ్చారు. ఫెండర్లపై ప్రత్యేక డార్క్ మాస్కాట్ కూడా ఉంటుంది.
ఇంటీరియర్‌లోనూ..
క్యాబిన్‌లో వయొలెట్ ఎక్లిప్స్ పేరుతో ఆల్-బ్లాక్ థీమ్‌ను అందించారు. ఎయిర్ వెంట్స్, ఫ్రంట్ కన్సోల్, డోర్ డెకో ప్రాంతాల్లో పర్పుల్ ఇన్‌సర్ట్స్ ఉంటాయి. గ్రానైట్ బ్లాక్ ఆర్ట్-లెదర్ సీట్లపై పర్పుల్ స్టిచింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. డ్యాష్‌బోర్డ్, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, డోర్ ఇన్‌సర్ట్స్‌లో సాఫ్ట్ వాల్యూమ్ 3డీ ప్యాటర్న్‌తో గ్రానైట్ బ్లాక్ ఆర్ట్-లెదర్ ఉపయోగించారు. స్టార్ట్-స్టాప్ స్విచ్ రింగ్, ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్‌కు డార్క్ క్రోమ్ ఫినిష్ ఇచ్చారు. స్టీరింగ్ వీల్ దిగువ భాగంలో పియానో బ్లాక్, ట్వీటర్ కవర్లు, రూఫ్ కన్సోల్ బెజెల్‌కు సాటిన్ మిడ్‌నైట్ బ్లాక్ ఫినిష్ ఉంది.
వేరియంట్లు, ఫీచర్లు
సియెర్రా డార్క్ ఎడిషన్ ప్యూర్ ఎల్ నుంచి టాప్-ఎండ్ అకాంప్లిష్డ్+ వరకు అందుబాటులో ఉంటుంది. అయితే ప్రతి వేరియంట్‌లో ఫీచర్లు వేర్వేరుగా ఉంటాయి.
Pure L: టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 8 స్పీకర్లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వాయిస్ కమాండ్స్, రియర్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, డ్రైవ్ మోడ్‌లు, హిల్ డిసెంట్ కంట్రోల్, టీపీఎంఎస్.
Pure L (O): పనోరమాక్స్ పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్లు.
Pure+ L: వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, థై సపోర్ట్ ఎక్స్‌టెన్షన్, బాస్ మోడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్.
Adventure+ L: 360-డిగ్రీ ఎస్‌వీఎస్ హెచ్‌డీ కెమెరా, 4సైట్ విజిబిలిటీ, సూపర్‌గ్లైడ్ సస్పెన్షన్, టెర్రైన్ మోడ్‌లు, పెద్ద స్క్రీన్లు.
Accomplished: లెవల్-2 ఏడీఏఎస్, హైపర్ హెడ్-అప్ డిస్‌ప్లే, 12-స్పీకర్ జేబీఎల్ బ్లాక్ డాల్బీ అట్మాస్ ఆడియో.
Accomplished+: హారిజన్ వ్యూ ట్రిపుల్ స్క్రీన్స్, లెవల్-2+ ఏడీఏఎస్, అడ్వాన్స్‌డ్ లైటింగ్, కనెక్టెడ్ టెక్నాలజీ, పవర్డ్ కన్వీనియన్స్ ఫీచర్లు.
ధరలు
* టాటా సియెర్రా డార్క్ ఎడిషన్ ధరలు రూ.13.99 లక్షల నుంచి రూ.21.59 లక్షల వరకు ఉన్నాయి. ప్యూర్ L డార్క్ వేరియంట్ 1.5 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ మాన్యువల్ ధర రూ.13.99 లక్షలు కాగా, క్రయోజెట్ డీజిల్ మాన్యువల్ ధర రూ.15.44 లక్షలు, రెవోట్రాన్ డీసీఏ ధర రూ.15.29 లక్షలుగా ఉంది. క్రయోజెట్ ఆటోమేటిక్, హైపీరియన్ ఆటోమేటిక్ ఆప్షన్లు ఇందులో లేవు.
* ప్యూర్ ఎల్ (ఓ) డార్క్ ధరలు పెట్రోల్ మాన్యువల్‌కు రూ.14.59 లక్షలు, డీజిల్ మాన్యువల్‌కు రూ.16.04 లక్షలు, పెట్రోల్ డీసీఏకు రూ.15.89 లక్షలు, డీజిల్ ఆటోమేటిక్‌కు రూ.17.34 లక్షలుగా ఉన్నాయి. ప్యూర్+ ఎల్ డార్క్ ధరలు వరుసగా రూ.15.29 లక్షలు, రూ.16.74 లక్షలు, రూ.16.59 లక్షలు, రూ.18.04 లక్షలుగా ఉన్నాయి.
* అడ్వెంచర్+ ఎల్ డార్క్ వేరియంట్ పెట్రోల్ మాన్యువల్‌తో రూ.17.29 లక్షలు, డీజిల్ మాన్యువల్‌తో రూ.18.49 లక్షలు, పెట్రోల్ డీసీఏతో రూ.18.59 లక్షలు, డీజిల్ ఆటోమేటిక్‌తో రూ.19.79 లక్షలు, హైపీరియన్ ఆటోమేటిక్‌తో రూ.19.29 లక్షలుగా ఉంది.
* ఇక అకాంప్లిష్డ్ డార్క్ ధర పెట్రోల్ మాన్యువల్‌కు రూ.18.29 లక్షలు, డీజిల్ మాన్యువల్‌కు రూ.19.29 లక్షలు, డీజిల్ ఆటోమేటిక్‌కు రూ.20.29 లక్షలు, హైపీరియన్ ఆటోమేటిక్‌కు రూ.20.29 లక్షలుగా ఉంది. టాప్-స్పెక్ అకాంప్లిష్డ్+ డార్క్‌లో డీజిల్ మాన్యువల్ ధర రూ.20.59 లక్షలు, డీజిల్ ఆటోమేటిక్ రూ.21.59 లక్షలు, హైపీరియన్ ఆటోమేటిక్ రూ.21.29 లక్షలుగా నిర్ణయించారు.
ఇంజిన్, గేర్‌బాక్స్ ఆప్షన్లు
సియెర్రా డార్క్‌లో 1.5-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్, 1.5-లీటర్ క్రయోజెట్ డీజిల్, 1.5-లీటర్ హైపీరియన్ టీజీడీఐ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ప్యూర్ ఎల్‌లో పెట్రోల్ 6-స్పీడ్ మాన్యువల్, డీజిల్ 6-స్పీడ్ మాన్యువల్, పెట్రోల్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ లభిస్తాయి. ప్యూర్ ఎల్ (ఓ)లో డీజిల్ ఆటోమేటిక్ కూడా చేరుతుంది. ప్యూర్+ ఎల్, అడ్వెంచర్+ ఎల్, అకాంప్లిష్డ్ వేరియంట్లలో పెట్రోల్, డీజిల్ మాన్యువల్/ఆటోమేటిక్ కాంబినేషన్లతో పాటు హైపీరియన్ టీజీడీఐ ఆటోమేటిక్ కూడా అందుబాటులో ఉంటుంది.
టాప్-స్పెక్ అకాంప్లిష్డ్+లో డీజిల్ 6-స్పీడ్ మాన్యువల్, డీజిల్ 6-స్పీడ్ ఆటోమేటిక్, హైపీరియన్ టీజీడీఐ 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లు ఉన్నాయి. స్మార్ట్+ ఎల్ వేరియంట్‌ను డార్క్ ఎడిషన్‌లో అందించలేదు.
Black has always belonged to the pieces that command attention.
To the designs that outlast the season.
Now, that presence takes shape on a legend.
And when black meets a legend, it becomes power, attitude.
It becomes #DARK.
Legend wears #DARK.#TataSierra #SierraDARK#TataCars… pic.twitter.com/8y7TYKXzHz— TATA.CARS (@TATA_CARS) September 21, 2026

