Tata: టాటా EV కార్ కొనాలనుకుంటున్నారా, ఇదే మంచి అవకాశం.. రూ. 3 లక్షల వరకు తగ్గింపు..
- పండగ సీజన్‌లో ఈవీ కార్ల సేల్స్ పెంచుకునేందుకు టాటా ప్లాన్..
- టాటా EV కార్లపై రూ. 3 లక్షల వరకు తగ్గింపు..
- నెక్సాన్.. పంచ్.. టియాగో కార్లకు వర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata: పండగ సీజన్‌ని క్యాష్ చేసుకోవాలనుకుంటోంది దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా. తన ఈవీ కార్లను పెద్ద ఎత్తు విక్రయించేందుకు ప్లాన్ చేసింది. నెక్సాన్ EV, పంచ్ EV మరియు టియాగో EV ధరలను రూ. 3 లక్షల వరకు తగ్గించింది. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా నెంబర్-1గా ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 24లో దాదాపుగా 74 శాతం మార్కెట్ వాటాతో 74,000 యూనిట్లను విక్రయించింది.
వేరియంట్ ఆధారంగా నెక్సాన్ EVకి రూ. 3 లక్షల వరకు , పంచ్ EVకి రూ. 1.20 లక్షల వరకు టియాగో EVకి రూ. 40,000 వరకు ధరని తగ్గించింది. ప్రస్తుతం దేశంలో నెక్సాన్EV దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు.
Also Read
- MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
- BYD Atto 3: BYD అట్టో 3 విడుదల.. 630KM రేంజ్, LiDAR టెక్నాలజీ, కేవలం 9 నిమిషాల్లో పూర్తి ఛార్జ్
- Yamaha Ethanol Bike: ఇథనాల్‌తో నడిచే యమహా బైక్ భారత్‌లోకి ఎప్పుడు? కంపెనీ కీలక ప్రకటన
- E100 Flex-Fuel Car: పెట్రోల్ ఖర్చుకు గుడ్‌బై చెప్పే రోజులు దగ్గర్లోనే.. E100 ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును తీసుకొస్తున్న మారుతి
పరిమిత కాలం వరకు ఈ తగ్గుదల నెక్సాన్ EV, పంచ్ EVల యొక్క బేస్ వేరియంట్లకు వర్తించనుంది. తగ్గిన ధరలతో ప్రస్తుతం ఎంట్రీ లెవల్ నెక్సాన్ EV ధర రూ. 12.29 లక్షలకు, ఎంట్రీ లెవల్ పంచ్ రూ. 9.99 లక్షలుగా ఉంది. అంతకుముందు వీటి ధర నెక్సాన్ EV బేస్ వేరియంట్ రూ. 14.49 లక్షలు, పంచ్ EV బేస్ వేరియంట్ ధర రూ. 10.99 లక్షలగా ఉంది. ఈ ధరల్ని ఎక్స్-షోరూం ధరలు.
ఇదే కాకుండా టాటా తన ఈవీ కస్టమర్ల కోసం టాటా పవర్ ఛార్జింగ్ స్టేషన్లలో ఆరు నెలల పాటు ఉచిత ఛార్జింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తోంది. దేశవ్యాప్తంగా 5,500 టాటా పవర్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. టాటా ప్రకారం, పండుగ ధరలు మరియు ఆఫర్లు అక్టోబర్ 31 వరకు చెల్లుతాయి. పరిమిత కాల ధరల తగ్గింపు ఈవీల ధరల్ని తగ్గించడంతో పాటు ఈవీలకు పెట్రోల్/డిజిల్ వాహనాల ధరల మధ్య అంతరాన్ని కూడా తగ్గించింది.
తాజావార్తలు
-
SRH vs RR : ప్లేఆఫ్స్‌లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
-
OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
-
Sun Risers Hyderabad: పెవిలియన్‌కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!