Site icon NTV Telugu

Tata Punch Facelift: టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది! ఫీచర్స్, లుక్ అదుర్స్‌ గురూ..

Tata Punch

Tata Punch

Tata Punch Facelift:టాటా పంచ్ తన ఆరంభం నుంచి బ్రాండ్‌కు అత్యంత విజయవంతమైన మోడళ్లలో ఒకటిగా నిలిచింది. సంవత్సరాలుగా స్థిరమైన అమ్మకాలతో ముందుకు సాగుతోంది. టాటా మోటార్స్ కాలక్రమేణా ఈ ఎస్‌యూవీకి కొత్త ఫీచర్లు జోడించినప్పటికీ, డిజైన్ మాత్రం పెద్దగా మారలేదు. ట్రెండ్‌కు అనుగుణంగా కంపెనీ పంచ్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల బయటకు వచ్చిన స్పై చిత్రాలు ఈ కొత్త మోడల్ ఉత్పత్తి దశకు దగ్గరగా ఉందని సూచిస్తున్నాయి.

READ MORE: Claim Rejected: హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరించబడిందా? అయితే ఇలా చేయండి…

కొత్త స్పై షాట్లలో రోడ్లపై పరీక్షలు చేస్తున్న రెండు టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ (పెట్రోల్ వెర్షన్) టెస్ట్ మ్యూల్స్ కనిపించాయి. ఇవి డ్యూయల్-టోన్ రూఫ్‌తో పాటు పంచ్ ఈవీని పోలిన స్టైలింగ్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉన్నాయి. ఈ ప్రోటోటైప్స్ దాదాపు ఉత్పత్తి దశకు చేరుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. అందువల్ల 2026 మొదటి అర్ధభాగంలో దీనిని లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా. బాగా కేమొఫ్లాజ్ చేసినప్పటికీ, కొన్ని డిజైన్ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందు భాగంలో 2026 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌కు కొత్తగా డిజైన్ చేసిన బంపర్ ఉండనుంది, ఇది కారుకు కొత్త లుక్ ఇస్తుంది. మెయిన్ గ్రిల్‌లో గాలి ప్రవేశానికి రెండు హారిజాంటల్ స్లిట్స్ ఉన్నాయి. ఎల్‌ఈడీ డీఆర్ఎల్‌లు గతంతో పోలిస్తే మరింత సన్నగా కనిపిస్తున్నాయి. హెడ్‌ల్యాంపులు నిలువుగా అమర్చిన విధానం పంచ్ ఈవీ తరహాలోనే ఉంది. కొన్ని వేరియంట్లలో కార్నరింగ్ ఫంక్షన్‌తో కూడిన ఫాగ్ ల్యాంపులు కూడా ఉండవచ్చు. కొత్త అలాయ్ వీల్ డిజైన్ కనిపిస్తున్నప్పటికీ, స్పై చిత్రాల్లో అవి పూర్తిగా కవర్ అయ్యి ఉన్నాయి. ప్రస్తుత మోడల్‌లాగే మందమైన నలుపు రంగు బాడీ క్లాడింగ్ అమర్చారు. ఇది పెయింట్ చేయనట్టు కనిపిస్తుంది. ఒక టెస్ట్ మ్యూల్‌లో 360 డిగ్రీ కెమెరా కూడా కనిపించింది. ఇవి బ్లైండ్-స్పాట్ మానిటరింగ్‌కు సహాయపడే అవకాశం ఉంది. కొత్త పంచ్‌కు భద్రతా ఫీచర్లు మరింత పెరగనున్నాయి.

READ MORE: IndiGo: బాంబు బెదిరింపుల గండం.. రెండు ఇండిగో విమానాలకి బాంబు బెదిరింపు మెయిల్

ఇంతకుముందు వచ్చిన స్పై షాట్ల ప్రకారం.. ఇంటీరియర్‌లో కూడా మార్పులు ఉంటాయి. కొత్త స్టీరింగ్ వీల్‌పై వెలిగే టాటా లోగో, పెద్ద 10.2 అంగుళాల టచ్‌స్క్రీన్, రీడిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ కనిపించనున్నాయి. అదనంగా ముందు సీట్లకు వెంటిలేషన్ ఫీచర్, 10.25 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, అలాగే లెవల్ 2 ఏడీఏఎస్ కూడా ఇవ్వవచ్చని అంచనా. ఇంజిన్ విషయానికి వస్తే, పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. ఇదే ఇంజిన్‌తో సీఎన్‌జీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. డ్యూయల్ సీఎన్‌జీ ట్యాంక్ సెటప్‌తో పాటు 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంఎట్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా యథాతథంగా కొనసాగనున్నాయి.

Exit mobile version