Site icon NTV Telugu

ADAS ఫీచర్లతో పాటు ప్రీమియం లుక్‌ను అందించే ఫీచర్లతో వచ్చేసిన Tata Nexon.ev!

Tata Nexon.ev

Tata Nexon.ev

Tata Nexon.ev: టాటా మోటార్స్ తమ నెక్సాన్.ev (Nexon.ev)ని కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. ఇప్పుడు ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) టెక్నాలజీతో ఉన్న కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టింది. దీంతో నెక్సాన్.ev వినియోగదారులకు మరింత సురక్షితమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ADAS ఫీచర్లతో పాటు, వెనుక విండో సన్‌షేడ్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లను కూడా చేర్చడం ద్వారా కారు మరింత ప్రీమియం లుక్‌ను సొంతం చేసుకుంది.

ఈ ADAS టెక్నాలజీలో ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ (TSR), లేన్ సెంటరింగ్ సిస్టమ్ (LCS), లేన్ డిపార్చర్ వార్నింగ్ (LDW), లేన్ కీప్ అసిస్ట్ (LKA), ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ (FCW), అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB), హై బీమ్ అసిస్ట్ (HBA) వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు కారు నడిపేవారికి మరింత భద్రతను కల్పిస్తాయి. అంతేకాకుండా, టాటా నెక్సాన్.ev సంబంధించి డార్క్ ఎడిషన్ను విడుదల చేసింది.

అదిరిపోయే అకాంక్షా లుక్స్: ఇంటర్నెట్‌ను ఊపేసిన చిత్రాలు

ఈ ఎడిషన్ ప్రత్యేకమైన ఆల్-బ్లాక్ డిజైన్‌తో వస్తుంది. ఈ కారు బయట పూర్తిగా బ్లాక్ రంగు, లోపల ఆల్-బ్లాక్ లెథరెట్ సీట్లను కలిగి ఉంటుంది. ఈ డార్క్ ఎడిషన్ 350 నుండి 370 కి.మీల రేంజ్ అందిస్తుంది. అలాగే 20% – 80% ఛార్జింగ్ కేవలం 40 నిమిషాల్లో పూర్తవుతుంది. అంతేకాకుండా కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 150 కి.మీల వరకు ప్రయాణించవచ్చు. ఈ కొత్త వేరియంట్ల ప్రారంభ ధర రూ. 17.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

ఈ కొత్త ఎడిషన్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్, వెహికల్ టు లోడ్ టెక్నాలజీ, 31.24 cm హర్మాన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెనుక విండో సన్‌షేడ్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటిలో 45 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 106 kW (142 hp) మరియు 215 Nm టార్క్‌ను అందిస్తుంది. కొత్తగా విడుదలైన వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలు చూస్తే.. ఎంపవర్డ్ +A 45 రూ.17.29 లక్షలు కాగా, ఎంపవర్డ్ +A 45 డార్క్ రూ.17.49 లక్షలు. ఇక ఎంపవర్డ్ +A 45 రెడ్ డార్క్ ధర రూ.17.49 లక్షలుగా ఉన్నాయి.ఈ కొత్త వేరియంట్ల ద్వారా టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తోంది.

కొత్త బైక్ లేదా స్కూటర్ కొనాలనేవారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న Honda వాహనాల ధరలు!

Exit mobile version