Site icon NTV Telugu

Tata Nano EV : టాటా నానో ఈవీ వచ్చేస్తుంది?.. ధర ఎంతంటే?

Tata Nano Ev

Tata Nano Ev

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. టాటా మోటార్స్ ఇప్పుడు భారతీయ ఆటో పరిశ్రమలో తన ప్రసిద్ధ కారు టాటా నానోను మళ్లీ ప్రారంభించాలని యోచిస్తోంది! అయితే ఈసారి ఈ కారు పూర్తిగా ఎలక్ట్రిక్‌తో ఉంటుందని సమాచారం. టాటా నానో ఈ కొత్త వెర్షన్ 2025 నాటికి ప్రారంభించబడవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో కేవలం రూ.2.5 లక్షల నుంచి రూ.8 లక్షల మధ్య బేసిక్ ధరతోనే టాటా నానో ఎలక్ట్రిక్ వెహికిల్‌ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అవుతున్నట్లు సమాచారం. టాటా నానో ఈవీ బేస్ వేరియంట్ ధర రూ.2.5 లక్షలతో ప్రారంభం కానున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక హైఎండ్ ఫీచర్స్‌తో కూడిన టాప్ వేరియంట్ ధర రూ.8 లక్షల వరకు ఉండొచ్చని సమాచారం. అయితే.. ధరపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. రతన్ టాటా (Ratan Tata) కలల కారుగా వస్తున్న ఈ టాటా నానో ఈవీ.. వాహన రంగంలో సరికొత్త ఒరవడిని తీసుకొస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సిటీ డ్రైవింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఈ కారును డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తక్కువ ధర, స్టైల్, కంఫర్ట్ విషయంలో కాంప్రమైస్ కాకుండా ఈ ఈవీ కారు మార్కెట్‌లోకి రానుంది.

READ MORE: New York To Paris: విమానంలో దొంగచాటుగా ప్రయాణించిన మహిళ.. కేసు నమోదు!

ఇక ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాల్లోకి వెళితే.. టాటా నానో ఈవీ మోస్ట్ పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌తో విడుదల కాబోతున్నట్లు సమచారం. ఇది 17 kWh బ్యాటరీ ప్యాక్‌తో మార్కెట్‌లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 312 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. అలాగే దీని గరిష్ఠ వేగం కూడా గంటకి దాదాపు 80కిలోమీటర్ల స్పీడ్‌ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ కారు ఛార్జ్‌ చేసేందుకు దాదాపు 6 నుంచి 8 గంటల పాటు టైమ్‌ కూడా పట్టే అవకాశాలు ఉన్నాయట. ఇక ఈ కారు లోపలి భాగంలో 7- అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. ఈ కారు టాటా కంపెనీ డిసెంబర్‌ చివరి వారంలో లేదా కొత్త సంవత్సరంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version