Tata Harrier & Safari: భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) భవిష్యత్తులో పలు కొత్త వాహనాల లాంచ్‌లకు సిద్ధమైంది. ఇందులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. కార్ల వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న Tata Harrier, Tata Safari SUVలకు పెట్రోల్ వేరియంట్లు తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. ఇప్పటి వరకు ఈ రెండు మోడళ్లు కేవలం డీజిల్ ఇంజిన్ తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందిన సమాచారం ప్రకారం.. హారియర్, సఫారీ మోడళ్లలో 1.5 లీటర్, 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇవ్వబోతున్నారు.
IPL 2026 Trades: ఐపీఎల్ చరిత్రలో 5 అత్యంత ఖరీదైన ట్రేడ్‌లు ఇవే!
ఇక ఈ కార్ల ఇంజిన్‌కు డ్యూయల్ క్లచ్ (DCT) లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జత చేయబడే అవకాశం ఉంది. శక్తి పరంగా ఈ యూనిట్ 170 hp పవర్, 280 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదని అంచనా. దీని పూర్తి వివరాలు రాబోయే టాటా సియరా మోడల్ లాంచ్ సందర్భంగా నవంబర్ 25న వెల్లడయ్యే అవకాశముంది. ఈ కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్ ప్రవేశపెట్టడం ద్వారా హారియర్, సఫారీ SUVలు తమ విభాగంలో పోటీదారులకి గట్టి పోటీ ఇవ్వగలవు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక SUVలు పెట్రోల్, డీజిల్ రెండు ఇంజిన్ ఎంపికలతో వస్తున్నాయి. దీనితో టాటా కూడా అదే దిశలో అడుగు వేస్తోంది. ఇది కేవలం ఎంపికలను పెంచడమే కాకుండా.. రెండు SUVల ధరలను కూడా కొంత తగ్గించే అవకాశం ఉందని ఆటో నిపుణులు చెబుతున్నారు.
రెండో కెమెరాతో రీడిజైన్ అవుతున్న iPhone Air 2.. సన్నని డిజైన్‌తో యాపిల్ మరో కొత్త ప్రయత్నం!
ప్రస్తుతం హారియర్, సఫారీ రెండింటిలోనూ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 167 hp పవర్, 350 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం టాటా సఫారీ ధరలు రూ. 14.66 లక్షలు (ఎక్స్‌షోరూమ్) నుండి ప్రారంభమవుతుండగా, టాటా హారియర్ ధరలు రూ. 14 లక్షలు (ఎక్స్‌షోరూమ్) నుండి మొదలవుతున్నాయి.
