NTV Telugu Site icon

Tata Motors: ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న టాటా కార్‌ల ధరలు..

Tata Cars

Tata Cars

Tata Motors: టాటా మోటార్స్ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు ఇకపై మరింత ధనాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. టాటా మోటార్స్ ఫిబ్రవరి 1 నుంచి అన్ని మోడళ్లపై ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీలపై ధరలు పెరగనున్నాయి.

Read Also: Apple Smartwatch : మరోసారి ట్రేండింగ్ లో యాపిల్ స్మార్ట్ వాచ్.. ఈసారి గాల్లో ఉండగానే..

కంపెనీ తన కార్ల ధరలను సగటున 0.7 శాతం పెంచనుంది. ఈ పెంపు ఫిబ్రవరి 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదలను పాక్షికంగా భర్తీ చేయడానికి ధరలు పెంచాల్సి వస్తోందని టాటా మోటార్స్ ప్రకటించింది. ప్రస్తుతం టాటా డిజిల్, పెట్రోల్, సీఎన్‌పీ, ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. ఇటీవల పూర్తిగా ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్ మీద బిల్ట్ అయిన పంచ్ ఈవీని టాటా విడుదల చేసింది. 2023లో ఏకంగా టాటా మోటార్స్ 5,50,838 యూనిట్ల కార్లను విక్రయించింది. ఈ ఏడాది 4.56 శాతం వృద్ధిని సాధించింది. అంతకు ముందు ఏడాది 2022లో 5,26,798 కార్లను విక్రయించింది.