NTV Telugu Site icon

Tata Nexon CNG Launch: లాంచింగ్‌కి సిద్ధమవుతున్న టాటా నెక్సాన్ CNG.. బ్రెజ్జాతో పోటీ..

Tata Nexon Cng

Tata Nexon Cng

Tata Nexon CNG Launch: ఇండియన్ ఆటోమేకర్ టాటా మోటార్స్ ఇప్పటికే పెట్రోల్-డిజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ కార్‌ల మార్కెట్లో సత్తా చాటుతోంది. మరోవైపు CNG మోడళ్లని కూడా నెమ్మదిగా మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ఇప్పటికే CNG వెర్షన్‌లో టాటా పంచ్, టియాగో, టిగోర్ వాహనాలు ఉండగా, త్వరలోనే ఈ వెర్షన్‌లో నెక్సాన్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రాబోయే నెలల్లో నెక్సాన్ సీఎన్‌జీ లాంచ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, పండగ సీజన్‌లో కారు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఈ ఏడాది మొదట్లో భారత్ మొబిలిటీ షో-2024లో టాటా తన నెక్సాన్ CNG కార్‌ని ప్రదర్శించింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ అమ్మకాల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న నెక్సాన్, డిజిల్-పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. దేశంలో వేగంగా అమ్ముడవుతున్న ఈవీ కార్లలో నెక్సాన్ ఒకటి.

Read Also: Crime News: బావతో కలిసి పారిపోయిన ఇద్దరు పిల్లల తల్లి.. నెల రోజుల తర్వాత ఇద్దరు మృతి

CNG సెగ్మెంట్లో మారుతి సుజుకి బ్రెజ్జా CNGకి టాటా నెక్సాన్ పోటీ ఇవ్వబోతోంది. ఇది 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పెట్రోల్, సీఎన్‌జీ రెండు మోడ్‌లలో కార్ పనిచేస్తుంది. పెట్రోల్ మోడ్‌లో 118 bhp పవర్, 170Nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. సీఎన్‌జీ మోడ్‌లో మాత్రం దీనితో పోలిస్తే ఇంజన్ తక్కువ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. దాదాపుగా ప్రస్తుతం ఉన్న నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లాగే ఈ సీఎన్‌జీ వెర్షన్ ఉండబోతుంది.

టాటా మోటార్స్ తన CNG కార్లలో ట్విన్-సిలిండర్ సెటప్‌ని అందిస్తోంది. బూట్ స్పేస్ కలిసి వచ్చేలా, రెండు సిలిండర్లను అమర్చుతోంది. ఇప్పటికే టియాగో, పంచ్ కార్లలో ఇదే తరహా టెక్నిక్‌తో సీఎన్‌జీ కార్లను తీసుకువచ్చింది. ట్విన్-సిలిండర్ CNG సెటప్‌తో, Nexon CNG దాదాపు 230-లీటర్ల బూట్ స్పేస్‌‌ని కలిగి ఉంటుంది.