Tata Nexon CNG Dark Edition: టాటా కొత్త సీఎన్‌జీ కారు విడుదల.. రేటు, రేంజ్ ఎంతంటే?
- నెక్సాన్ సీఎన్‌జీ రెడ్ డార్క్ విడుదల
- మూడు వేరియంట్లలో కారు
- రూ.12.70 లక్షల నుంచి ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాటా మోటార్స్ నెక్సాన్ సీఎన్‌జీ (Nexon CNG) రెడ్ డార్క్‌ను విడుదల చేసింది. కంపెనీ ఎక్స్-షోరూమ్ ధరలను రూ.12.70 లక్షల నుంచి రూ.13.69 లక్షల వరకు ఉంచింది. ఫియర్‌లెస్ + PS, క్రియేటివ్ + PS, క్రియేటివ్ + S వంటి మూడు వేరియంట్‌లలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కంపెనీ దీనిని భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రవేశపెట్టింది. రెడ్ డార్క్ ఎడిషన్ ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. రెడ్ కలర్ యాక్సెంట్‌లతో ఎక్స్టీరియర్‌లో కార్బన్ బ్లాక్ పెయింట్ స్కీమ్‌ను పొందుతుంది.
నెక్సాన్ సీఎన్‌జీ రెడ్ డార్క్ ఎక్స్-షోరూమ్ ధరలు..
టాటా నెక్సాన్ సీఎన్‌జీ రెడ్ డార్క్ క్రియేటివ్+ఎస్ ధర రూ. 12.70 లక్షలు
టాటా నెక్సాన్ సీఎన్‌జీ రెడ్ డార్క్ క్రియేటివ్+పీఎస్ ధర రూ. 13.70 లక్షలు
టాటా నెక్సాన్ సీఎన్‌జీ రెడ్ డార్క్ ఫియర్‌లెస్+పిఎస్ ధర రూ. 13.70 లక్షలు.
Also Read
- TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
- 2026 Audi Q7: సూపర్ ఫాస్ట్ SUV.. 4.8 సెకన్లలోనే 100 కిమీ వేగాన్ని అందుకునే 2026 Audi Q7
- Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
- Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్‌తో రానున్న బ్లింక్ మోడల్
ఈ ఎస్‌యూవీలో అట్రాక్టివ్ ఫీచర్లు చాలానే ఉన్నాయి. ఇది 10.2- అంగుళాల ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్స్టుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, జేబీఎల్- 8 స్పీకర్ సిస్టం, 360- డిగ్రీ కెమెరా వంటివి ఇందులో ఉంటాయి. ఇది 5- సీటర్ ఆప్షన్‌తో వస్తుంది.
నెక్సాన్ సీఎన్‌జీ 98.5bhp, 170Nm ఉత్పత్తి చేసే 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ MTతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. టాటా యొక్క ట్విన్-సిలిండర్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. ఇందులో CNG ట్యాంక్ మొత్తం సామర్థ్యం 60 లీటర్లు. బూట్ స్పేస్ 321 లీటర్లు. టాటా దీని మైలేజ్ 17.44 కిమీ/కిలో అని పేర్కొంది. అయితే, దీని వాస్తవ మైలేజ్ కీలోకు నగరంలో 11.65 కి.మీ, హైవేలో 17.5 కి.మీకి దగ్గరగా ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
-
Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
ట్రెండింగ్
-
Fact Check: హీరోయిన్‌తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..