దేశీయ ఆటోమొబైల్స్ దిగ్గజం టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల ధరలను 0.55 శాతం పెంచింది. జూలై 9 నుంచి అన్ని కార్లు, ఇతర ప్యాసింజర్ వాహనాల ధరలు వేరియంట్ ను బట్టి సుమారుగా 0.55 శాతం పెంచింది. టాటా మోటార్స్ గతంలో కొన్ని నెలల క్రితం ఇలాగే తన వాహనాల ధరలను పెంచింది. తాజగా మరోసారి ప్యాసింజర్ వెహికిల్స్ ధరలను పెంచింది.
పెరిగిన తయారీ ఖర్చులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇటీవల కాలంలో ముడి భాగాలు, స్టీల్, చిప్ సెట్ల కొరత ఇలా చాలా రకాల సమస్యలు ఆటోమొబైల్స్ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. దీంతో అన్ని ఆటోమొబైల్స్ దిగ్గజాలు తమ కార్ల రేట్లను పెంచాయి. చివరి సారిగా ఏప్రిల్ 2022 చివరన టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల ధరలను సగటున 1.10 శాతం పెచింది. వాణిజ్య, గూడ్స్ వాహనాల ధలరను 1.5 నుంచి 2.5 శాతం వరకు పెంచింది.
Read Also: Crime News: మహిళపై అత్యాచారం.. సీఐ సస్పెండ్
ప్రస్తుతం కార్ల పరిశ్రమను సెమికండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉక్రెయిన్- రష్యా పరిణామాలు కూడా గ్లోబల్ సప్లై చైన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో కార్లను బుక్ చేసుకుంటే నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని కార్లు వినియోగదారులకు డెలివరీ కావడానికి 6 నుంచి 8 నెలల సమయం కూడా పడుతోంది. దీంతో పాటు స్టీల్, అల్యూమిన్యం వంటి ముడి సరుకుల ధరలు కూడా పెరగడంతో కూడా కార్ల తయారీ ఖర్చును పెంచాయి.