NTV Telugu Site icon

Tata Harrier EV: టాటా హరియర్ EV, పెట్రోల్ వెర్షన్ల లాంచింగ్ ఎప్పుడంటే..

Tata Harrier Petrol And Ev

Tata Harrier Petrol And Ev

Tata Harrier EV: దేశీయ కార్ మేకర్ టాటా దూసుకుపోతోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్‌ల(EV) కేటగిరీలో సత్తా చాటుతోంది. ఇప్పటికే టాటా నుంచి నెక్సాన్, టిగోర్, టియాగో, పంచ్ మోడళ్లు ఈవీ వెర్షన్‌‌లో ఉన్నాయి. ఇతర కార్‌ల కంపెనీలతో పోలిస్తే టాటా ఈవీ సెగ్మెంట్‌లో టాప్ పొజిషన్‌లో ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాటా హారియర్ EVని తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తోంది. దీంతో పాటు ఇప్పటి వరకు హారియర్ డిజిల్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది, దీంట్లో పెట్రోల్ వెర్షన్ కూడా ఇంట్రడ్యూస్ చేయనుంది. డిజిల్ పవర్ ట్రెయిన్‌తో టాటా హారియర్ హ్యుందాయ్ క్రేటా, మారుతి సుజుకీ విటారా గ్రాండ్ విటారాకు పోటీని ఇస్తోంది.

Read Also: PM Modi: రాహుల్ గాంధీది మావోయిస్టు భాష.. మమతా బెనర్జీవి ఓటు బ్యాంకు రాజకీయాలు..

నివేదికల ప్రకారం.. వచ్చే ఏడాది 2025లో హారియర్ ఈవీ, హారియర్ పెట్రోల్ వెర్షన్లు లాంచ్ అవుతాయని తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన సమచారం అధికారికంగా టాటా నుంచి రాలేదు. భారతీయ మార్కెట్లో రాబోయే టాటా హారియర్ EVని రూ. 30 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు అందించవచ్చని అంచనాలు ఉన్నాయి. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో పాటు ముందు వెనక చక్రాలకు పవర్ అందించే విధంగా రెండు మోటార్లతో ఈ కారు వస్తోంది. ఒక్క ఫుల్ ఛార్జ్‌తో ఏకంగా 500 కి.మీ రేంజ్ ఇవ్వనుంది. దీని డిజైన్ కూడా ప్రస్తుతం ఉన్న హారియర్ మోడల్‌ని పోలి ఉంటుంది. ఈ SUVలో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ AC, 6-వే పవర్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది.

ఇక ప్రస్తుతం మిడ్ సైజ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో ఇప్పటికే హ్యుందాయ్ క్రేటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్, కియా సెల్టోస్‌లు డిజిల్, పెట్రోల్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే, వచ్చే ఏడాది టాటా కూడా తన హారియర్‌ని పెట్రోల్ వేరియంట్‌లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు టాటా ప్రతిష్టాత్మక కార్ నెక్సాన్ CNGని రాబోయే కొన్ని నెలల్లో లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది.