Tata EV Cars Discount: ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకుంటున్న కస్టమర్లకు టాటా మోటార్స్ శుభవార్త చెప్పింది. ఎలక్ట్రిక్ కార్లను సామాన్యులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో.. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తన ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. టాటా మోటార్స్ తమ ఎలక్ట్రిక్ విభాగం ‘టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ’ (TPEML) ద్వారా ఈ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఓల్డ్ స్టాక్ (MY24, MY25)తో పాటు సరికొత్త MY26 మోడళ్లపైనా ఈ తగ్గింపులు వర్తించనున్నాయి.
Read Also: Operation Sindoor: భారత్ దెబ్బకు ఇంకా రిపేర్లు చేయించుకుంటున్న పాకిస్తాన్..
రూ. 3.8 లక్షల వరకు ఆఫర్లు:
అయితే, ఈ ఫిబ్రవరి మాసంలో టాటా ఈవీ కార్లలో కార్వ్ ఈవీ (Curvv EV)పై అత్యధికంగా రూ. 3.8 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. క్రియేటివ్ 45 వేరియంట్‌లో MY24, MY25 మోడళ్లకు రూ. 3.3 లక్షలు, MY26 మోడళ్లకు రూ. 2.8 లక్షలు, మిగిలిన వేరియంట్లపై గరిష్టంగా రూ. 3.8 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఇక, టాటా పంచ్ ఈవీపై రూ. 1.6 లక్షల వరకు ఆఫర్ కొనసాగుతుంది. ఫిబ్రవరి 20వ తేదీన పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌కు ముందుగా.. ప్రస్తుత టాటా పంచ్ ఈవీ మోడళ్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది.
Read Also: Vellampalli Srinivas: లడ్డూలో ఫ్యాట్ ఉందని నిరూపిస్తారా.. కూటమి నేతలకు వెల్లంపల్లి ఛాలెంజ్..
డిస్కౌంట్లు:
* MY24, MY25 మోడళ్లపై రూ. 1.6 లక్షల వరకు
* కొత్త MY26 మోడళ్లపై రూ. 90,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
* నెక్సాన్, టియాగో, హారియర్ ఈవీలపై ప్రత్యేక తగ్గింపులు
* నెక్సాన్ ఈవీ (Nexon EV): పాత స్టాక్‌పై రూ. 1.2 లక్షల వరకు, MY26 మోడళ్లపై రూ. 30,000 వరకు తగ్గింపు
* టియాగో ఈవీ (Tiago EV): పాత స్టాక్‌పై రూ. 1.5 లక్షల వరకు, కొత్త మోడళ్లపై రూ. 60,000 వరకు ఆఫర్
* హారియర్ ఈవీ (Harrier EV): అన్ని వేరియంట్లపై యూనిఫాంగా రూ. 1.5 లక్షల డిస్కౌంట్ ఉండగా.. MY26 మోడళ్లలో లాయల్టీ బోనస్ అందిస్తున్న ఏకైక ఈవీ ఇదే కావడం విశేషం.
అయితే, పెట్రోల్, డీజిల్ ఖర్చుల నుంచి విముక్తి పొంది ఎలక్ట్రిక్ కారుకు మారాలని భావిస్తున్నవారికి ఈ ఫిబ్రవరి నెల మంచి ఛాన్స్ అని చెప్పాలి. వేరియంట్లను బట్టి డిస్కౌంట్లు మారవచ్చు కాబట్టి, కొనుగోలుకు ముందు మీకు సమీపంలోని టాటా డీలర్‌ను సంప్రదించడం బెటర్..
