Tata Ace Gold Plus Mini Truck: చిన్న వ్యాపారులకు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి బడ్జెట్ ధరలో టాటా మోటార్స్ ఏస్ గోల్డ్+ మిని ట్రక్ (Tata Ace Gold Plus Mini Truck)ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో టాటా ఏస్ గోల్డ్+ ప్రత్యేకత దాని లీన్ నార్త్ ట్రాప్ (LNT) సాంకేతికత. ఈ సాంకేతికత కారణంగా డీజిల్ ఎగ్సాస్ట్ ఫ్లూయిడ్ (DEF) వాడాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల నిర్వహణ ఖర్చులు, నిర్వహణ శ్రమ గణనీయంగా తగ్గుతాయి. కఠినమైన ప్రమాణాలను పాటిస్తూనే, ఇది ప్రతి ట్రిప్‌లోనూ వినియోగదారులకు ఎక్కువ లాభాలను ఆర్జించేలా చేస్తుందని టాటా మోటార్స్ చెబుతోంది.
OG Pre Release Event: ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్
దీని ధర కేవలం రూ. 5.52 లక్షలు (ఎక్స్-షోరూమ్). అత్యంత సరసమైన డీజిల్ వేరియంట్‌గా వచ్చిన ఈ కొత్త మోడల్, తక్కువ నిర్వహణ ఖర్చుతో గరిష్ట ఆదాయాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ మినీ ట్రక్‌లో టర్బోచార్జ్‌డ్ డీకోర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 21 hp శక్తిని, 55 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 900 కిలోల బరువును మోయగల సామర్థ్యం, అనేక లోడ్ డెక్ కాన్ఫిగరేషన్లతో ఇది వివిధ వ్యాపార అవసరాలకు అనుగుణంగా తయారయ్యింది.
PM Modi: ఇలా చేస్తేనే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంది.. దేశ ప్రజలకు మోడీ కీలక సూచన..
టాటా మోటార్స్ చిన్న కమర్షియల్ వాహనాలు పికప్ పోర్ట్‌ఫోలియోలో S Pro, ACE, Intra, Yoda వంటి మోడళ్లు ఉన్నాయి. ఇవి 750 కిలోల నుండి 2 టన్నుల వరకు పేలోడ్ సామర్థ్యంతో లభిస్తాయి. డీజిల్, పెట్రోల్, CNG, బై ఫ్యూయెల్, ఎలక్ట్రిక్ వంటి పలు రకాల పవర్‌ట్రెయిన్లలో ఈ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వాహనాలకు ‘సంపూర్ణ సేవ 2.0’ అనే సమగ్ర సపోర్ట్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇది AMC ప్యాకేజీలు, నిజమైన స్పేర్ పార్ట్‌లు, 24×7 రోడ్‌సైడ్ సహాయాన్ని అందిస్తుంది.
