Suzuki Access 125 New Colours Launched: సుజుకి (Suzuki) Access 125 స్కూటర్ లైనప్‌లో రెండు కొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేసింది. రైడ్ కనెక్ట్ ఎడిషన్, రైడ్ కనెక్ట్ ABS ఎడిషన్లలో మెటాలిక్ రాయల్ బ్రాంజ్ రంగును అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే రైడ్ కనెక్ట్ TFT ABS ఎడిషన్‌లో మెటాలిక్ మ్యాట్ బోర్డో రెడ్ కొత్త కలర్ ఆప్షన్‌గా చేరింది. ఈ కొత్త కలర్ ఆప్షన్లు 2026 నవంబర్ 23 నుంచి దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి రానున్నాయి.
కొత్త కలర్స్, వేరియంట్ల ధరలు..
మెటాలిక్ రాయల్ బ్రాంజ్ కలర్‌ను రైడ్ కనెక్ట్, రైడ్ కనెక్ట్ ABS వేరియంట్లలో అందిస్తున్నారు. వీటిలో ఇప్పటికే ఉన్న మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నంబర్ 2, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్ రంగులతో పాటు పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్ కలర్ కూడా అందుబాటులో ఉంది. రైడ్ కనెక్ట్ ఎడిషన్ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌లో రూ.91,627 కాగా, రైడ్ కనెక్ట్ ABS ఎడిషన్ ధర రూ.98,432గా ఉంది.
TFT ABS ఎడిషన్‌లో బోర్డో రెడ్..
రైడ్ కనెక్ట్ TFT ABS ఎడిషన్‌లో మెటాలిక్ మ్యాట్ బోర్డో రెడ్ కొత్త రంగుగా చేరింది. ఈ వేరియంట్‌లో మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నంబర్ 2, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్ రంగులు కూడా ఉన్నాయి. దీని ధర ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌లో రూ.1,03,780గా ఉంది. ఇందులో 4.2 అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే, బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, సింగిల్ ఛానల్ ABS ఫీచర్లు ఉన్నాయి.
ఐదు వేరియంట్లలో..
సుజుకి Access 125 ప్రస్తుతం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ ఎడిషన్‌లో సాలిడ్ ఐస్ గ్రీన్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నంబర్ 2, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ కలర్స్ ఉన్నాయి. దీని ధర రూ.83,086. స్పెషల్ ఎడిషన్ ధర రూ.89,428గా ఉంది. ఇందులో మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నంబర్ 2, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, సాలిడ్ ఐస్ గ్రీన్ రంగులు లభిస్తాయి. ఈ స్కూటర్ ధరలు రూ.83,086 నుంచి రూ.1,03,780 వరకు ఉన్నాయి. స్టాండర్డ్ ఎడిషన్‌తో పోలిస్తే స్పెషల్ ఎడిషన్ ధర రూ.6,342 ఎక్కువ. స్పెషల్ ఎడిషన్ కంటే రైడ్ కనెక్ట్ ఎడిషన్ ధర రూ.2,199 అధికం. రైడ్ కనెక్ట్‌లో ABS వేరియంట్ కోసం మరో రూ.6,805 చెల్లించాలి. ఇక రైడ్ కనెక్ట్ ABS ఎడిషన్‌తో పోలిస్తే TFT ABS ఎడిషన్ ధర రూ.5,348 ఎక్కువ.
ఇంజిన్, టెక్నాలజీ ఫీచర్లు..
Suzuki Access 125లో 125cc సింగిల్ సిలిండర్, ఫోర్ స్ట్రోక్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇందులో SOHC, 2-వాల్వ్ సెటప్, ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ ఉన్నాయి. ఈ ఇంజిన్ OBD-2B ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. సుజుకి ఎకో పెర్ఫార్మెన్స్ (SEP) టెక్నాలజీని కూడా అందించారు. రైడ్ కనెక్ట్ వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. TFT ABS ఎడిషన్‌లో 4.2 అంగుళాల కలర్ డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రైడ్ కనెక్ట్ ABS, రైడ్ కనెక్ట్ TFT ABS వేరియంట్లలో సింగిల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)ను అందించారు. అత్యవసర బ్రేకింగ్ సమయంలో ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది.
The Suzuki Access just got two more reasons to turn heads! Check out the new colours and tell us which one’s your pick?
#SuzukiIndia #SuzukiMotorcycle #SuzukiAccess #AccessNewColours https://t.co/qa3a5uo4g3
— Suzuki Motorcycle India (@suzuki2wheelers) November 23, 2026

