NTV Telugu Site icon

Electric car: స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమి నుంచి 2024లో ఎలక్ట్రిక్ కారు.. ఒక్క చార్జ్‌తో 1000 కి.మీ మైలేజ్..!

Electric Car

Electric Car

షియోమి నుంచి 2024లో మొదటి ఎలక్ట్రిక్ వాహనంతో పాటు ఉత్పత్తిని ప్రారంభిస్తుందని వెల్లడించింది. చైనా వార్షిక పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడుతున్న షియోమి సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీ జున్ ఈ టాపిక్ ను వెల్లడించారు. 2022 నాటికి కంపెనీ తన ఈవీ వెంచర్ లో మూడు బిలియన్ యువాన్లను(434.3 మిలియన్ డాలర్లు ) పెట్టుబడి పెట్టిందని, కంపెనీ తన సమయంలో సగ భాగం షియోమీ ఈవీ కారు వ్యాపారం గురించే ఖర్చు చేస్తోందని ఆయన తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ కారు అధికారికంగా ఆవిష్కరణకు ముందు, తొలి మోడల్, చిత్రాలు వెలువడ్డాయి. షియోమీ కారు 2024లో ఉత్పత్రిలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎంఎస్11 ఎలక్ట్రిక్ కారు ఇటీవల ఆటో ఎక్స్ పో 2023లో ప్రదర్శించబడిన బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ తరహాలో ఈ కారు డిజైన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర ప్రముఖ గ్లోబల్ మోడళ్ల ప్రభావం కూడా దీని డిజైన్ వెనుక ఉన్నట్లు తెలుస్తోంది.
నాలుగు డోర్ల ఎలక్ట్రిక్ సెడాన్ ప్రవహించే ఏరోడైనమిక్ సిల్హౌట్ ను కల్గింది. ముందు భాగంలో ఎల్ఈడీ లైట్లు త్రిశూల్ ఆకారంలో పెట్టినట్లు తెలుస్తోంది. దీని స్పోర్ట్ లుక్ కారు దూుడు రూపాన్ని ఇస్తోంది. ఇది మెక్ లారెన్ 720ఎస్ మాదిరిగానే కనిపిస్తోందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

Also Read : Sunday Bhakthi Tv Live: అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే..

షియోమీ ఎంఎస్11 పెద్ద విండ్ షీల్డ్, మంచి సైడ్ గ్లాస్ ఏరియాను కలిగి ఉంది. ఇది వెనుకకు విస్తరించే పనోరమిక్ సన్ రూఫ్ ను కూడా కలిగి ఉంది. ఇది చక్రాల మధ్యలో షియోమీ లోగోను కలిగి ఉంది. ఇది పసుపు రంగు బ్రెంబో బ్రేక్ కాలిపర్ లతో వస్తుంది. విండ్ షీల్డ్ పైన కూర్చునే సెన్సార్ కూడా ఉంది. కారు వెనుక విస్తృత వంపులు ఉన్నాయి. ప్యాసింజర్ క్యాబిన్ వెనేక భాగంలో కొద్దిగా ఇరుకైంది. టెయిల్ లైట్ లు ఆస్టన్ మార్టిన్ లాంటి డిజైన్ ను కలిగి ఉంది. లీకైన చిత్రాల్లో, ఇంటీరియల్, సహా ఇతర టెక్నికల్ ఫీచర్ల గురించి ఎటువంటి వార్తలు వినిపించడం లేదు. షియోమీ తన తొలి ఎలక్ట్రిక్ కారును డెవలప్ చేసే చివరి దశలో ఉన్నట్లు సమాచారం. చైనీస్ రోడ్లపై, శీతకాలపు పరీక్షల సమయంలో ఈ కారును అనేక సార్లు గుర్తించినట్లు తెలుస్తోంది. షియోమీ ఎంఎస్ 11 ఎలక్ట్రిక్ కారులో కంపెనీ స్వయంగా అభివృద్ది చేసిన ఎలక్ట్రిక్ మోటర్ ను అమర్చారు. దీని బ్యాటరీలు బీవైడీతో సహా కంపెనీలకు చెందినవని నివేదికలు చెబుతున్నాయి. షియోమీ కూడా ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1,000 కి.మీ వరకు ప్రయాణించగలదని పేర్కొంది. ఈవీ దాదాపు 260 కిలోవాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయగల 800 వోల్ట్ సిస్టమ్ తో వస్తుంది.

Also Read : BSNL : బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్స్.. ఇక ప్రైవేట్ కంపెనీలకు కష్టాలే

Show comments