Skoda Peak EV: స్కోడా కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ SUV ‘పీక్’ ఆవిష్కరణ.. 647KM రేంజ్‌తో అదిరిపోయే ఫీచర్లు
- స్కోడా కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ SUV
- స్కోడా పీక్ ఆవిష్కరణ
- 647KM రేంజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ స్కోడా తన కొత్త ఫ్లాగ్షిప్ 7-సీటర్ ఎలక్ట్రిక్ SUV ‘స్కోడా పీక్’ను ఆవిష్కరించింది. కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో ఇది అతిపెద్ద SUVగా నిలవనుంది. హ్యుందాయ్ ఐయోనిక్ 9, కియా EV9, వోల్వో EX90 వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ SUVలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. భవిష్యత్తులో భారత మార్కెట్లోనూ ఈ మోడల్‌ను ప్రవేశపెట్టే అవకాశాలను కంపెనీ పరిశీలిస్తోంది.
ఆకట్టుకునే డిజైన్
స్కోడా పీక్‌లో కంపెనీ తాజా మోడర్న్ డిజైన్ ఫిలాసఫీని ఉపయోగించింది. ముందు భాగంలో T-ఆకారపు LED మ్యాట్రిక్స్ హెడ్లైట్లు, ఐబ్రో స్టైల్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLs) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మూసివేసిన గ్రిల్, గ్లాస్-బ్లాక్ ఫినిషింగ్, స్కూప్-స్టైల్ బోనెట్, బంపర్‌లో ఎయిర్ వెంట్స్ SUVకు ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి.
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
సైడ్, రియర్ ప్రొఫైల్
సైడ్ ప్రొఫైల్‌లో 19 లేదా 21 అంగుళాల ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, LED టర్న్ ఇండికేటర్లతో కూడిన ORVMలు ఉన్నాయి. వెనుక భాగంలో పెద్ద స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, T-ఆకారపు LED టెయిల్ లైట్లు, రిఫ్లెక్టర్లతో కూడిన బంపర్ వాహనానికి స్పోర్టీ లుక్‌ను అందిస్తున్నాయి.
లగ్జరీ ఫీచర్లు
స్కోడా పీక్‌లో 13.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, 10 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.
అదనంగా ఇందులో డ్యూయల్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్, అన్ని వరుసలలో USB ఛార్జింగ్ పోర్టులు, పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ కీ సపోర్ట్, స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్‌వాచ్ ద్వారా అన్‌లాక్ సదుపాయం, 16-స్పీకర్ల సోనోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
బ్యాటరీ, రేంజ్ వివరాలు
స్కోడా పీక్‌ను 60, 90, 90X అనే మూడు వేరియంట్లలో అందించనున్నారు. ఈ SUV వోక్స్వ్యాగన్ MEB ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించారు. బ్యాటరీ ఆప్షన్స్.. 63kWh బ్యాటరీ ప్యాక్, 91kWh బ్యాటరీ ప్యాక్. 63kWh బ్యాటరీతో గరిష్టంగా 459 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుండగా, 91kWh బ్యాటరీతో ఒకే ఛార్జ్‌పై గరిష్టంగా 647 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.
వేరియంట్లు, పనితీరు
Peak 60
204 hp శక్తి
సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్
0-100 km/h వేగం: 8.6 సెకన్లు
Peak 90
286 hp శక్తి
91kWh బ్యాటరీ
0-100 km/h వేగం: 7.1 సెకన్లు
Peak 90X (టాప్ వేరియంట్)
డ్యూయల్ మోటార్ AWD వ్యవస్థ
299 hp శక్తి
గరిష్ట రేంజ్: 613 కిలోమీటర్లు
0-100 km/h వేగం: కేవలం 6.7 సెకన్లు
భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!