Skoda kylaq: స్కోడా కైలాక్ సంచలనం.. జనవరిలో1,242 యూనిట్ల విక్రయం..
- డిసెంబర్ 2వ తేదీన బుకింగ్స్
- జనవరి 27 నుంచి ప్రారంభమయిన డెలివరీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ఆటోమొబైల్ రంగం జనవరి 2025లో మంచి ఫలితాలను చవిచూసింది. స్కోడా కొత్త కార్లను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఇది కారు ప్రియులలో విపరీతమైన ఉత్సాహాన్ని రేకెత్తించింది. కాగా..ఇటీవల విడుదలైన స్కోడా కైలాక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. జనవరి 2025లో అత్యధికంగా 1,242 యూనిట్లు అమ్ముడయ్యాయి. ‘స్కోడా కైలాక్’ SUV బుకింగ్స్ డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు జనవరి 27 నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 1,242 కస్టమర్లు దీన్ని సొంతం చేసుకున్నారు.
ఎందుకింత క్రేజ్..
ఈ కారుకు ఎందుకు ఇంత క్రేజ్ అంటే తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను కలిగి ఉండటం! ముఖ్యంగా స్కోడా కైలాక్ 25 కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో స్కోడా కైలాక్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఆరు ఎయిర్ బ్యాగులు, హాట్ స్టాంప్డ్ స్టీల్ ప్యానెల్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్, స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ అమర్చారు. వీటితో పాటు మల్టీ కొలిషన్ బ్రేక్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, బ్రేక్ డిస్క్ వైపింగ్, రోల్ ఓవర్ ప్రొటెక్షన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హై స్పీడ్ అలర్ట్స్, సెంట్రల్ లాకింగ్, సీట్ బెల్ట్ ప్రీటెన్షన్స్, రిమైండర్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. హై ఎండ్ వేరియంట్లలో హిల్ హోల్డ్ కంట్రోల్, యాంటీ థెఫ్ట్ అలారం, రియర్ పార్కింగ్ కెమెరా తదితర ఫీచర్స్ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
Also Read
- Jawa 42 All Stars Edition: జావా 42 ఆల్ స్టార్స్ ఎడిషన్ బైక్ లాంచ్.. 27.1hp పవర్, డ్యూయల్ ఛానల్ ABS, ధర ఎంతంటే?
- ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
- Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
- Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
స్కోడా కైలాక్ ఫీచర్లు
స్కోడా కైలాక్ 1.0 లీటర్ 3 సిలిండర్ టీఎస్ఐ పెట్రోల్ యూనిట్‌తో పనిచేస్తుంది. ఈ ఎస్‌యూవీలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్లు టాప్ 2 ట్రిమ్ స్థాయిలతో మాత్రమే అందుబాటులో ఉండగా, మిడ్ స్పెక్ సిగ్నేచర్ వేరియంట్ 5 ఇంచ్ టచ్‌స్క్రీన్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రు మెంట్ ప్యానెల్‌ని పొందుతుంది. బేస్ క్లాసిక్ వేరియంట్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ని పొందుతుంది.
తాజావార్తలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!