NTV Telugu Site icon

Skoda Kylaq: 4 వేరియంట్లలో “స్కోడా కైలాక్”.. రూ. 14.40 లక్షలకే టాప్ వేరియంట్

New Project (3)

New Project (3)

Skoda Kylaq: స్కోడా ఇండియా ప్రతిష్టాత్మకంగా ‘‘కైలాక్’’ని భారతీయ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ సెగ్మెంట్‌లో స్కోడా కైలాక్ రాకతో మరింత పోటీ పెరుగనుంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటివి ఉన్నాయి. ఇప్పుడు కైలాక్ ఎంట్రీ ఇవ్వబోతోంది.

తాజాగా స్కోడా కైలాక్ వేరియంట్స్, వాటి ధరల్ని వెల్లడించింది. కైలాక్ 4 వేరియంట్లలో లభ్యమవుతోంది. ఇప్పటికే క్లాసిక్ వేరియంట్ ఎంట్రీ ఫ్రైజ్‌ని రూ.7.89 లక్షలుగా ప్రకటించింది. స్కోడా కైలాక్ క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్+ మరియు ప్రెస్టీజ్ వేరియంట్లలో లభ్యమవుతోంది.

వేరియంట్ ధరలు, బుకింగ్స్, డెలివరీ వివరాలు:

సిగ్నేచర్ వేరియంట్ మాన్యువల్ ధర రూ. 9.59 లక్షలు , ఆటోమేటిక్ వేరియంట్ రూ. 10.59 లక్షలుగా ఉంది. సిగ్నేచర్+ వేరియంట్ మాన్యువల్‌కు రూ.11.40 లక్షలు, ఆటోమేటిక్ వేరియంట్‌కు రూ. 12.40 లక్షలకు రిటైల్ అవుతుంది. టాప్ వేరియంట్ ప్రెస్టీజ్ మాన్యువల్ ధర రూ. 13.35 లక్షలు, ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 14.40 లక్షలుగా ఉంది. బుకింగ్స్ డిసెంబర్ 02 నుంచి ప్రారంభమయ్యాయి. జనవరి 27, 2025 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

ప్రత్యేక ఆఫర్‌గా స్కోడా తన మొదటి 33,333 కస్టమర్‌లకు కాంప్లిమెంటరీ 3 సంవత్సరాల సాండర్డ్ మెయింటనెన్స్ ప్యాకేజీని అందిస్తుంది. ఈ ప్యాకేజ్ మొదటి 5 ఏళ్లలో కార్ మెయింటనెన్స్ ధర కిలోమీటర్‌కి రూ. 0.20కి తగ్గిస్తుందని కంపెనీ పేర్కంది. కైలాక్ దాదాపుగా 8 లక్షల కి.మీ పైగా కఠిన పరీక్షలు ఎదుర్కొంది. కైలాక్ 7 రంగులు- టోర్నాడో రెడ్, బ్రిలియంట్ సిల్వర్, కాండీ వైట్, కార్బన్ స్టీల్, లావా బ్లూ, డీప్ బ్లాక్, ఆలివ్ గోల్డ్ లభ్యమవుతుంది.

ఇంజన్ వివరాలు:

కైలాక్ 1.0 లీటర్ , 3 సిలిండర్ TSI పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 114 hp ,178 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను కలిగి ఉంది. టాప్ వేరియంట్ ప్రెస్టీజ్‌ ఆటోమేటిక్ వేరియంట్‌లో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, సన్‌రూఫ్, 17-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, యాంబియంట్ లైటింగ్, 6-వే పవర్ అడ్జస్ట్‌మెంట్‌తో కూడిన వెంటిలేటెడ్ సీట్లు, ప్యాడిల్ షిఫ్టర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 6- ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్‌గా లభిస్తున్నాయి. EBDతో కూడిన ABS, రెయిర్ పార్కింగ్ సెన్సార్స్, ఈఎస్‌సీ అండ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ ఉన్నాయి. స్కోడా కైలాక్ 3 ఏళ్లు లేదా 1 లక్ష కి.మీ స్టాండర్డ్ వారంటీని కలిగి ఉంది.