Skoda Kushaq Facelift: స్కోడా ఆటో ఇండియా భారత మార్కెట్ కోసం కొత్త Skoda Kushaq Faceliftను అధికారికంగా ఆవిష్కరించింది. ధరలను ఇంకా ప్రకటించకపోయినా, బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొత్త అవతార్‌లో కుషాక్ మరింత స్టైలిష్‌గా.. సరికొత్త ఫీచర్లతో.. టెక్నాలజీ పరంగా మరింత ఆధునికంగా కనిపిస్తోంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా సియెర్రా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది.
కొత్త కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లో స్కోడా తాజా డిజైన్ లాంగ్వేజ్ స్పష్టంగా కనిపిస్తుంది.
* స్లీక్ LED హెడ్‌ల్యాంప్‌లు
* కనుబొమ్మ ఆకారంలో DRLలు
* గ్రిల్‌ను అనుసంధానించే లైట్ బార్
* కొత్త బంపర్, సిల్వర్ స్కిడ్ ప్లేట్
ఇవి SUVకి మరింత బోల్డ్, ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి. మోంటే కార్లో వేరియంట్‌లో రెడ్ యాక్సెంట్స్, గ్లోస్ బ్లాక్ ఫినిష్, ప్రత్యేక బ్యాడ్జింగ్ స్పోర్టీ ఫీల్‌ను ఇస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో పెద్ద మార్పులేమీ లేకపోయినా, కొత్త 16, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఆకర్షణగా నిలుస్తాయి. వెనుక భాగంలో LED లైట్ బార్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు, ప్రకాశవంతమైన ‘SKODA’ లెటరింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
కొత్త రంగులు:
ఇక, కొత్త కుషాక్ లో సరికొత్త రంగులు ఉన్నాయి.. సిమ్లా గ్రీన్, బ్రిలియంట్ సిల్వర్, కాండీ వైట్, కార్బన్ స్టీల్, చెర్రీ రెడ్, డీప్ బ్లాక్, లావా బ్లూ, స్టీల్ గ్రే అందిస్తోంది స్కోడా..
బేస్ వేరియంట్ నుంచే సన్‌రూఫ్
కొత్త కుషాక్‌లో అత్యంత ముఖ్యమైన అప్‌డేట్ ఇదే.. బేస్ వేరియంట్ నుంచే ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ అందుబాటులోకి వచ్చింది. టాప్ వేరియంట్‌లో అయితే పనోరమిక్ సన్‌రూఫ్ ఎంపిక కూడా ఉంది. ఈ ఫీచర్ సన్‌రూఫ్ ప్రేమికులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.
ప్రీమియం ఇంటీరియర్ & ఫీచర్లు
* క్యాబిన్ లోపల కుషాక్ మరింత లగ్జరీ ఫీల్ ఇస్తుంది.
* సెగ్మెంట్-ఫస్ట్ రియర్ సీట్ మసాజ్ ఫంక్షన్
* లెథరెట్ సీట్లు
* వెంటిలేషన్‌తో ఎలక్ట్రిక్ ఫ్రంట్ సీట్లు
* 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
* 10-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్
* ఆల్-LED ఇంటీరియర్ లైటింగ్
* ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు
ఇంజిన్ & పనితీరు
కొత్త కుషాక్‌లో రెండు పెట్రోల్ ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి:
* 1.0 లీటర్ TSI – 104 bhp పవర్, 250 Nm టార్క్
* 1.5 లీటర్ TSI (4 సిలిండర్) – 147 bhp పవర్, 250 Nm టార్క్
ట్రాన్స్మిషన్ ఎంపికలు:
* 1.0 TSIకి 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్
* 1.5 TSIకి 7-స్పీడ్ DSG ఆటోమేటిక్
AI టెక్నాలజీ & భద్రత
కొత్త కుషాక్‌లో Google Gemini AI అసిస్టెంట్తో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. వాయిస్ కమాండ్లతో వాహన ఫీచర్లను నియంత్రించవచ్చు.
ఇక, భద్రతా ఫీచర్ల విషయానికి వస్తే..
* 6 ఎయిర్‌బ్యాగులు (స్టాండర్డ్)..
* ESC, EBD, ట్రాక్షన్ కంట్రోల్
* హిల్ హోల్డ్ అసిస్ట్
* ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్
* ఆటో డిమ్మింగ్ IRVM
* ఈ SUV ఇప్పటికే 5-స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్ పొందింది.
మోంటే కార్లో వేరియంట్‌లో..
* బ్లాక్-అవుట్ ఎలిమెంట్స్
* రెడ్ యాక్సెంట్ గ్రిల్
* డ్యూయల్ టోన్ పెయింట్
* స్పోర్టీ బ్యాడ్జింగ్
బుకింగ్‌లు ప్రారంభం: స్కోడా ఇంకా ధరలను ప్రకటించకపోయినా, ఆధికారిక బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. స్కోడా అధికారిక వెబ్‌సైట్ మరియు అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా బుకింగ్ చేయవచ్చు. ధరల ప్రకటన త్వరలో జరగనుంది. మొత్తంగా, కొత్త Skoda Kushaq Facelift స్టైల్, ఫీచర్లు, భద్రత మరియు టెక్నాలజీ కలయికగా మిడ్-సైజ్ SUV విభాగంలో బలమైన ఎంపికగా నిలుస్తోంది.
