NTV Telugu Site icon

Royal Enfield Shotgun 650 : మార్కెట్ లోకి వచ్చేసిన కొత్త బుల్లెట్ బండి.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Bullet Bike (2)

Bullet Bike (2)

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటే యూత్ లో క్రేజ్ ఎక్కువ.. ఆ బండి మీద వెళ్తుంటే అదొక హుందా తనం వస్తుందని అని ఫీల్ అవుతారు.. అందుకే బుల్లెట్ బండి కొనాలని ఆశ పడతారు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో అద్భుతమైన షాట్‌గన్ 650 బుల్లెట్ బైకును మార్కెట్ లోకి తీసుకొని వచ్చింది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ బైకు ఫీచర్స్, ధర ఎంతో ఒక లుక్ వేద్దాం పదండీ..

యూకే, యూరోపియన్ మార్కెట్‌లలో లాంచ్ అయిన షాట్‌గన్ 650 ఫిబ్రవరి 2024 నుంచి అందుబాటులోకి రానుంది. మోటార్‌సైకిల్ యూకేలో 6,699 పౌండ్‌లు, యూరప్ (జర్మనీ, ఫ్రాన్స్) అంతటా 7,590 యూరోల వద్ద ప్రారంభమవుతుంది.. ఇండియాలో ఫ్రీ బుకింగ్ లు ప్రారంభం కాగా, మార్చి నుంచి మార్కెట్ లోకి విడుదల కానుంది.. దేశంలో ఈ బైకు ధర రూ. 3,59,430 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ 2024 వసంతకాలం నుంచి అమెరికా, ఆసియా-పసిఫిక్ (ఏపీఏసీ)లోకి ప్రవేశిస్తుంది. షాట్‌గన్ 650 ఎస్‌జీ650 కాన్సెప్ట్ నుంచి ప్రేరణ పొందింది..

గోవాలో ఈ బైకు డిజైన్ చేయబడింది.. 650 ట్విన్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా షాట్‌గన్ 650 648సీసీ, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సీ, ఎయిర్-ఆయిల్ కూల్డ్, ఈఎఫ్ఐ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. 46.4హెచ్‌పీ గరిష్ట శక్తిని 52.3ఎన్ఎమ్ పీక్ ట్విస్టింగ్ ఫోర్స్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.. అలాగే స్టీల్ ట్యూబులర్ స్పైన్ ఫ్రేమ్‌ను ఉపయోగిస్తుంది.. ఈ కొత్త బుల్లెట్ షాట్‌గన్ 650 స్టెన్సిల్ వైట్, ప్లాస్మా బ్లూ, గ్రీన్ డ్రిల్, షీట్ మెటల్ గ్రే అనే 4 కలర్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌తో కూడిన డిజి-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌ను పొందుతుంది..

గతంలో వచ్చిన బైకుకు అప్డేట్ గా వచ్చింది.. ఫీచర్స్ అన్ని కూడా సరికొత్తగా ఉన్నాయి.. ఇక షాట్‌గన్ 650 కోసం 31 జెన్యూన్ మోటార్‌సైకిల్ అప్లియన్సెస్ అందజేస్తుంది. వీటిలో బార్ ఎండ్ మిర్రర్స్, స్కల్ప్టెడ్ సోలో సీట్, కాంట్రాస్ట్-కట్ బిల్లెట్ రిమ్‌లు ఉన్నాయి.. వేరియంట్ ను బట్టి ధర కూడా నిర్ణయించారు.. మార్చిలో భారతదేశంలోకి రానుంది.. బుల్లెట్ లవర్స్ కు పండగే..