Royal Enfield Classic 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ వచ్చేసింది. కంపెనీ తమ పాపులర్ బైక్ క్లాసిక్ 350ని కొత్తగా ‘సిగ్నేచర్ వైట్’ (Signature White) కలర్ వేరియంట్‌లో మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. పండుగ సీజన్ ముందర కొత్త బైక్ కొందామనుకునే వారికి ఇది నిజంగా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు పాత మోడల్ క్లాసిక్ 350లో ఉండే ఈ కలర్ షేడ్‌ను.. ఇప్పుడు కస్టమర్ల డిమాండ్ మేరకు కొత్త J-సిరీస్ క్లాసిక్ 350లో మొదటిసారిగా రీ-ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కొత్త ఎడిషన్‌ను ఎక్స్-షోరూమ్‌లో రూ.2,23,275 ధరకు అందుబాటులోకి తెచ్చారు.
ఈ సిగ్నేచర్ వైట్ మోడల్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్‌లో చాలా క్లీన్‌గా, క్లాసీగా కనిపిస్తూ ఓ వింటేజ్ లుక్‌ను ఇస్తుంది. బైక్ ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్‌పై వైట్ కలర్ ఇచ్చి, వాటి సరిహద్దుల్లో సన్నటి బ్లాక్ లైనింగ్ అందించారు. ట్యాంక్‌పై క్లాసిక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ రౌండ్ బ్యాడ్జ్, సైడ్ ప్యానెల్స్‌పై రాయల్ ఎన్‌ఫీల్డ్ కర్వీ బ్యాడ్జింగ్ బైక్ అందాన్ని మరింత పెంచాయి. ఇక ఫ్రంట్, రియర్ మడ్‌గార్డ్స్, హెడ్‌లాంప్ హౌసింగ్, బైక్ ఫ్రేమ్‌లకు బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వడంతో వైట్ బాడీకి అదిరిపోయే కాంట్రాస్ట్ వచ్చింది. సైలెన్సర్ (ఎగ్జాస్ట్), ఇంజన్ కవర్, మిర్రర్లపై క్రోమ్ టచ్ ఇవ్వడం వల్ల రెట్రో లుక్ మరింత గ్రాండ్‌గా అనిపిస్తుంది. దీనికి తోడు బ్రౌన్ కలర్ సీట్ ఇవ్వడం ఈ వైట్ అండ్ బ్లాక్ థీమ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ఇది కేవలం కలర్ అప్‌డేట్ మాత్రమే. బైక్ ఇంజన్ లేదా మిగతా మెకానికల్ పార్ట్స్‌లో ఎలాంటి మార్పులూ చేయలేదు. ఇందులో మునుపటిలాగే అదే నమ్మకమైన 349cc, సింగిల్-సిలిండర్ ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 6,100 rpm వద్ద 20.2 bhp పవర్, 4,000 rpm వద్ద 27 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అంతేకాకుండా అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌తో కూడిన 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఇందులో లభిస్తుంది. ఇక, ఈ కొత్త కలర్ రావడంతో ఇప్పుడు క్లాసిక్ 350 బైక్ మొత్తం 10 రకాల కలర్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉన్నట్లయింది. ధరల విషయానికి వస్తే.. ఈ కొత్త సిగ్నేచర్ వైట్ వేరియంట్ ధర ఇదివరకే అందుబాటులో ఉన్న ఎమ్మెరాల్డ్ (Emerald) కలర్ ధరతో సమానంగా రూ.2,23,275 గా ఉంది. స్టీల్త్ బ్లాక్ (Stealth Black), గన్ గ్రే (Gun Grey) వేరియంట్ల కంటే ఈ కొత్త వైట్ షేడ్ సుమారు రూ.4,852 వరకు ఎక్కువ కావడం గమనార్హం.
పూర్తి క్లాసిక్ 350 రేంజ్ ఎక్స్-షోరూమ్ ధరలను ఒకసారి పరిశీలిస్తే.. అందరికంటే తక్కువ ధరకు రెడ్డిచ్ రెడ్ రూ.1,87,434 లభిస్తుండగా, హాల్సియాన్ బ్లాక్ రూ.1,90,195కి అందుబాటులో ఉంది. అలాగే మద్రాస్ రెడ్, జోధ్‌పూర్ బ్లూ వేరియంట్లు రూ.1,93,668 ధరకు లభిస్తుండగా.. మెడాలియన్ బ్రాంజ్ రూ.1,98,040, కమాండో శాండ్ రూ.2,09,684 ధరకు సొంతం చేసుకోవచ్చు. టాప్ రేంజ్‌లో స్టీల్త్ బ్లాక్, గన్ గ్రేలు రూ.2,18,423కి లభిస్తుండగా.. అత్యధిక ధర కలిగిన వేరియంట్లుగా ఎమ్మెరాల్డ్, ఈ కొత్తగా వచ్చిన సిగ్నేచర్ వైట్ రూ.2,23,275 వద్ద నిలిచాయి. మంచి రెట్రో లుక్, ప్రీమియం బైక్ కోరుకునే వారికి ఈ కొత్త సిగ్నేచర్ వైట్ ఖచ్చితంగా ఒక బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

