Site icon NTV Telugu

Royal Enfield Bullet 650: గోవాలో రాయల్ ఎంట్రీ ఇచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650.. ధర, స్పెషిఫికేషన్స్ ఇవే!

Royal Enfield Bullet 650

Royal Enfield Bullet 650

Royal Enfield Bullet 650: గోవాలో జరుగుతున్న మోటోవర్స్ ఫెస్టివల్‌లో ఎట్టకేలకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మోటార్‌సైకిల్‌ను గతంలో ఇటలీలోని మిలన్‌లో జరిగిన EICMA 2025లో ప్రదర్శించారు. ఈ రాయల్ బైక్ అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించనప్పటికీ, బుల్లెట్ 650.. 2026 ప్రారంభంలో భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర సుమారు ₹3.40 లక్షల నుంచి ప్రారంభమవుతుందని సమాచారం.

READ ALSO: Minister Srinivasa Rao: విశాఖలో జరిగిన సీఐఐ సమ్మిట్ తర్వాత ప్రపంచమే ఏపీ వైపు చూస్తుంది..

రాయల్ బైక్ రంగు.. డిజైన్
ఈ బైక్ కొనుగోలుదారులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 రెండు రంగుల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కానన్ బ్లాక్, మరొకటి బాటిల్‌షిప్ బ్లూ. డిజైన్, స్టైలింగ్ పరంగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 బుల్లెట్ 350కి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ఇందులో “టైగర్-ఐ” పైలట్ లాంప్‌తో సిగ్నేచర్ సర్క్యులర్ LED హెడ్‌లైట్, RE బ్యాడ్జ్‌తో కూడిన టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, చేతితో పెయింట్ చేసిన పిన్‌స్ట్రిప్స్, సింగిల్-పీస్ సీటు, చదరపు వెనుక ఫెండర్, పెరిగిన క్రోమ్ హ్యాండిల్‌బార్ ఉన్నాయి. స్టీల్ ట్యూబులర్ స్పైన్ ఫ్రేమ్ ఆధారంగా రూపొందించిన RE బుల్లెట్ 650లో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇందులో ఇంధన స్థాయి, గేర్ స్థానం, ట్రిప్ మీటర్, సర్వీస్ రిమైండర్ కోసం డిజిటల్ ఇన్‌సెట్‌లతో కూడిన అనలాగ్ స్పీడోమీటర్ అందుబాటులో ఉంది. ఇది USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ సర్దుబాటు చేయగల బ్రేక్ లేదా క్లచ్ లివర్‌లను కలిగి ఉంటుంది.

ఈ బైక్ 19-అంగుళాల ముందు, 18-అంగుళాల వెనుక స్పోక్ వీల్స్‌తో ట్యూబ్‌లెస్ టైర్లతో నడుస్తుంది. బ్రేకింగ్‌ను 320mm ముందు డిస్క్, 300mm వెనుక డిస్క్ బ్రేక్, డ్యూయల్-ఛానల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ద్వారా మరింత మెరుగుపరిచారు. సస్పెన్షన్ సెటప్‌లో 43mm టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. ఈ బైక్ 243 కిలోల బరువు, 14.8 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం కలిగి ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650.. 647.95cc, ట్విన్-సిలిండర్, ఇన్‌లైన్, 4-స్ట్రోక్ SOHC ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 7,250 rpm వద్ద 47 bhp, 5,150 rpm వద్ద 52.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే ఇంజిన్ 650cc ట్విన్‌లకు శక్తినిస్తుంది. ఇది 6-స్పీడ్ కాన్‌స్టంట్ మెష్, వెట్ మల్టీ-ప్లేట్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేసి వస్తుంది.

READ ALSO: Leopard Attack: శభాష్ బేటా.. చిరుతతో పోరాడిన 11 ఏళ్ల బాలుడు..

Exit mobile version