Royal Enfield బైక్ లవర్స్‌కు క్రేజీ న్యూస్.. 10 ఏళ్ల వారంటీ.. ఎక్స్ట్రా ఖర్చు లేకుండానే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) బైక్ కొనుగోలుదారులకు అదిరిపోయే శుభవార్త అందించింది కంపెనీ. తన కస్టమర్ల కోసం సరికొత్త 10 ఏళ్ల సర్వీస్ యాక్టివేటెడ్ వారంటీ (Service Activated Warranty) పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా అదనంగా ఎలాంటి ముందస్తు ఖర్చు లేకుండానే గరిష్ఠంగా 10 ఏళ్లు లేదా 70,000 మైళ్లు (సుమారు 1,12,650 కిలోమీటర్లు) వరకు వారంటీ పొందవచ్చు. నవంబర్ 20, 2026 నుంచి గ్రేట్ బ్రిటన్, నార్తర్న్ ఐర్లాండ్ ప్రాంతాల్లో ఈ పథకం అమల్లోకి వచ్చింది. దీర్ఘకాలం పాటు బైక్‌లను వినియోగించే కస్టమర్లకు భరోసా కల్పించడంతో పాటు, అధీకృత సర్వీస్ సెంటర్లకు కస్టమర్ల రాకను పెంచడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
10 ఏళ్ల వారంటీ ఎలా పొందాలంటే?
సాధారణంగా కంపెనీలు అందించే ఎక్స్టెండెడ్ వారంటీ కోసం కొనుగోలుదారులు అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త పథకం దీనికి భిన్నంగా పనిచేస్తుంది. ముందుగా బైక్‌కు లభించే సాధారణ మూడేళ్ల ఫ్యాక్టరీ వారంటీ పూర్తవుతుంది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం రాయల్ ఎన్ఫీల్డ్ అధీకృత డీలర్‌షిప్‌లో షెడ్యూల్డ్ సర్వీస్ చేయించుకోవాలి. ఇలా ప్రతి ఏడాది సర్వీస్ చేయించుకున్నప్పుడు అదనంగా 12 నెలల వారంటీ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. ఈ విధానాన్ని బైక్‌కు 10 ఏళ్లు పూర్తయ్యే వరకు లేదా 70,000 మైళ్ల ప్రయాణం పూర్తయ్యే వరకు కొనసాగించవచ్చు. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే అప్పటితో వారంటీ ముగుస్తుంది.
Also Read
- Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!
- New Bajaj Pulsar RS200: కొత్త Bajaj Pulsar RS200 లాంచ్.. Google Maps, TFT డిస్ప్లేతో క్రేజీ ఫీచర్స్.. ధర ఎంతంటే?
- TVS Star City Plus: స్ల్పెండర్కు గట్టిపోటీ ఇచ్చిన టీవీఎస్ బైక్‌కు ముగింపు .. చరిత్రలోకి స్టార్ సిటీ ప్లస్!
- Volkswagen T-Roc R: 328HP పవర్‌తో Volkswagen T-Roc R SUV.. 250kmph టాప్ స్పీడ్‌తో అదరగొట్టే ఫీచర్లు!
ఏయే బైక్‌లకు వర్తిస్తుంది?
రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త వారంటీ పథకం పలు ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌లకు వర్తిస్తుంది. 350cc జే-సిరీస్‌లో క్లాసిక్ 350, హంటర్ 350, మీటియర్ 350, బుల్లెట్ 350 మోడళ్లు ఉన్నాయి. 450సీసీ షెర్పా ప్లాట్ఫామ్లో హిమాలయన్ 450, గురిల్లా 450 బైక్‌లకు ఈ అవకాశం కల్పించారు. అలాగే 650cc ట్విన్ సిరీస్‌లో ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650, సూపర్ మీటియర్ 650, షాట్‌గన్ 650, బేర్ 650, క్లాసిక్ 650 మోడళ్లు కూడా అర్హత పొందాయి. కొత్త 750cc మోడళ్లకు సైతం ఈ పథకం వర్తిస్తుంది. అయితే పాత యూసీఈ 500cc మోడళ్లు, హిమాలయన్ 411, స్క్రామ్ 411 బైక్‌లకు ఈ వారంటీ వర్తించదు.
పాత కస్టమర్లకు కూడా..
ఈ పథకం కేవలం కొత్తగా బైక్ కొనుగోలు చేసేవారికే పరిమితం కాదు. ఇప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లు కలిగి ఉన్న యూకే కస్టమర్లు కూడా అర్హత నిబంధనలకు అనుగుణంగా ప్రయోజనం పొందవచ్చు. గతంలో తమ బైక్‌లకు స్థానిక ప్రైవేట్ గ్యారేజీల్లో సర్వీసింగ్ చేయించుకున్నవారు కూడా తిరిగి ఈ వారంటీ పరిధిలోకి రావచ్చు. ఇందుకోసం అధీకృత డీలర్‌షిప్‌లో చెల్లింపు ద్వారా షెడ్యూల్డ్ సర్వీస్ చేయించుకోవడంతో పాటు, ఉచిత వెహికల్ హెల్త్ చెకప్ పూర్తి చేయాలి. అయితే వారంటీ క్లెయిమ్ చేసుకోవడానికి 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ వారంటీ కింద బైక్‌లో ఊహించని విధంగా తలెత్తే మెకానికల్, ఎలక్ట్రికల్ విడిభాగాల వైఫల్యాలకు కవరేజ్ లభిస్తుంది. అయితే సాధారణ వినియోగం వల్ల అరిగిపోయే బ్రేక్ ప్యాడ్స్, చైన్, స్ప్రాకెట్లు, టైర్లు, ఫిల్టర్లు, బాడీ వర్క్ వంటి వాటికి వారంటీ వర్తించదు.
భారత్‌లోనూ ఈ వారంటీ..
ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ 10 ఏళ్ల సర్వీస్ యాక్టివేటెడ్ వారంటీని యూకేలో రిజిస్టర్ అయిన బైక్‌లకు మాత్రమే అందిస్తోంది. భారత్‌లో మాత్రం కస్టమర్లకు సాధారణంగా మూడేళ్ల ఫ్యాక్టరీ వారంటీ లభిస్తోంది. అదనంగా కంపెనీ రైడ్ ష్యూర్ (Ride Sure) ప్రోగ్రామ్ ద్వారా చెల్లింపు ఆధారంగా గరిష్ఠంగా ఏడేళ్లు లేదా 70,000 కిలోమీటర్ల వరకు ఎక్స్టెండెడ్ వారంటీ పొందే అవకాశం ఉంది. భారత్‌లో రాయల్ ఎన్ఫీల్డ్కు భారీ కస్టమర్ బేస్ ఉన్న నేపథ్యంలో ఈ 10 ఏళ్ల వారంటీ పథకాన్ని ఇక్కడ కూడా ప్రవేశపెడితే కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కాకపోతే భారత్‌లో ఈ పథకాన్ని ప్రారంభించే విషయంపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో భారతీయ బైక్ ప్రియులు ఈ పథకం కోసం మరికొంతకాలం వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Royal Enfield బైక్ లవర్స్‌కు క్రేజీ న్యూస్.. 10 ఏళ్ల వారంటీ.. ఎక్స్ట్రా ఖర్చు లేకుండానే..!
-
Chiranjeevi-Megaverse: ‘మెగావర్స్’లో స్టార్ హీరోల సందడి.. ప్రభాస్, పవన్, చరణ్.. లిస్ట్ ఇంకా పెద్దదే!
-
HanuMan 2 : టాలీవుడ్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్.. తేజ సజ్జా కాదు ‘హను-మాన్ 2’లోకి మెగా హీరో ఎంట్రీ?
-
Mayukha : ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’.. కానీ ఒక్క కండిషన్?
-
New York Accident: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. ఉద్యోగం సాధించిన వారానికే మృత్యుఒడికి..
ట్రెండింగ్
-
Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!
-
Ball Tampering Scandal: కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్‌బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..
-
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!