NTV Telugu Site icon

Rolls Royce Ghost: రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొత్త మోడల్ లాంచ్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..!

Rolls Royce Ghos

Rolls Royce Ghos

ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్.. భారతదేశంలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II లైనప్‌ను ప్రారంభించింది. ఈ ఆటోమేకర్ తన ప్రామాణిక ఘోస్ట్ సిరీస్ II, ఎక్స్‌టెండెడ్ ఘోస్ట్ సిరీస్ II, బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ II మోడళ్లను ఇండియాలో విడుదల చేసింది. ఈ మూడు మోడల్స్ కూడా అనేక గొప్ప లక్షణాలతో వస్తున్నాయి. వాటి ధర కూడా చాలా ప్రీమియం.. ఇంతకు ఈ కార్లు ఎలాంటి ఫీచర్లతో వస్తున్నాయో తెలుసుకుందాం..

Read Also: UP: రైతుకు సమీపంగా వచ్చిన పులి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

ధర
రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II భారతదేశంలో ప్రారంభించారు. ఇవి మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్స్ చెన్నై, ఢిల్లీ షోరూమ్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు.
స్టాండర్డ్ గోస్ట్ సిరీస్ II: రూ. 8.95 కోట్లు (ఎక్స్-షోరూమ్)
ఎక్స్‌టెండెడ్ గోస్ట్ సిరీస్ II: రూ. 10.19 కోట్లు (ఎక్స్-షోరూమ్)
బ్లాక్ బీజ్ ఘోస్ట్ సిరీస్ II: రూ. 10.52 కోట్లు (ఎక్స్-షోరూమ్)

కొత్త ఫీచర్లు:
రోల్స్-రాయిస్ ఘోస్ట్ సిరీస్ II పునఃరూపకల్పన చేశారు. ఇది మరింత ఆకర్షణీయమైన డిజైన్, కొత్త ఫీచర్లతో వచ్చింది
*కొత్త హెడ్‌లైట్లు & ఫ్రంట్ బంపర్: కొత్తగా రిడైజైన్డ్ హెడ్‌లైట్లు, LED DRLsతో తాజా డిజైన్.. అలాగే ముందు బంపర్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చారు.
*రోల్స్-రాయిస్ క్రోమ్ గ్రిల్ & ‘స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ’: క్లాసిక్ క్రోమ్ గ్రిల్, హెడ్ హుడ్‌పై గుర్తించే ‘స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ’ హుడ్ ఆర్ఎనమెంట్.
*LED టెయిల్ లైట్లు: వెనుక భాగంలో కొత్తగా LED టెయిల్ లైట్లు చేర్చారు.
*22-అంగుళాల 9-స్పోక్ అల్లాయ్ వీల్స్: కొత్త 22 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

క్యాబిన్ & ఫీచర్లు:
రోల్స్-రాయిస్ ఘోస్ట్ సిరీస్ II లో డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కొత్త కనెక్టివిటీ ఫీచర్లతో అప్ గ్రేడ్ చేశారు. బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్ ప్రత్యేకమైన టాన్, బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌తో వస్తుంది.

V12 ఇంజిన్ & పెర్ఫార్మెన్స్
రోల్స్-రాయిస్ ఘోస్ట్ సిరీస్ II ఇప్పుడు ట్విన్-టర్బోచార్జ్డ్ V12 ఇంజిన్ తో అమర్చారు. ఇది అద్భుతమైన శక్తి మరియు సామర్ధ్యాన్ని అందిస్తుంది. బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ II లో ఈ ఇంజిన్ మరింత మెరుగైన ట్యూనింగ్‌తో ఉంటుంది.