NTV Telugu Site icon

Rolls-Royce Cullinan Series II: రోల్స్ రాయిస్ నుంచి కొత్త వెర్షన్ లాంచ్.. పూర్తి వివరాలు ఇవే

Rolls Royce Cullinan Series

Rolls Royce Cullinan Series

రోల్స్ రాయిస్ సూపర్ లగ్జరీ SUV.. కుల్లినన్ సిరీస్ II కొత్త వెర్షన్‌ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. కల్లినన్ సిరీస్ II ప్రారంభ ధర రూ. 10.50 కోట్లు కాగా.. బ్లాక్ బ్యాడ్జ్ కల్లినన్ సిరీస్ II ను కూడా ప్రారంభించింది. దీని ధర రూ. 12.25 కోట్లు (ఎక్స్-షోరూమ్). మారుతున్న భారతీయ లగ్జరీ ట్రెండ్‌లు, కస్టమర్ ప్రాధాన్యతలకు ప్రతిస్పందనగా రోల్స్ రాయిస్ ఈ కారును డిజైన్ చేశారు.

Hezbollah: హసన్ నస్రల్లా ఎవరు..? అతను హిజ్బుల్లాకు అధిపతి ఎలా అయ్యాడు

రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్ II ఫీచర్లు:
కల్లినన్ సిరీస్ II ఇప్పుడు డాష్‌బోర్డ్ ఎగువ భాగంలో పిల్లర్ టు పిల్లర్ గ్లాస్ ప్యానెల్‌ను కలిగి ఉంది. కొత్త స్టైలింగ్, రివైజ్డ్ ఇంటీరియర్ మరియు అప్‌డేటెడ్ టెక్నాలజీ పొందుతుంది. అలాగే.. డిజిటల్ అప్‌గ్రేడ్‌లో 18-స్పీకర్ ఆడియో సిస్టమ్, Wi-Fi హాట్‌స్పాట్ కనెక్షన్, ప్రతి స్క్రీన్‌కి స్వతంత్ర స్ట్రీమింగ్ వంటి అధునాతన కనెక్టివిటీ ఎంపికలు కూడా ఉన్నాయి. బ్లూటూత్ ద్వారా వెనుక సీట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కనెక్ట్ చేసే ఎంపిక చేర్చబడింది. అదనంగా.. కల్లినన్ సిరీస్ II లోపల ఉన్న స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీ కూడా ఆకర్షణీయమైన యానిమేషన్‌తో డ్రైవర్ డిస్‌ప్లేలో చేర్చబడింది.

Bhagat Singh Jayanti: ఉరితాడును ముద్దాడిన విప్లవ వీరుడు.. షాహిద్ భగత్‌సింగ్

ఇంజిన్ పవర్:
ఇంజన్ గురించి మాట్లాడితే.. రోల్స్ రాయిస్ కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ 6.75 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V12 ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 571 hp శక్తిని, 850 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్ ఇంజన్ 600hp పవర్, 900Nm టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ పంపుతుంది.

డెలివరీ:
భారతీయ కస్టమర్లకు మొదటి డెలివరీలు 2024 నాలుగో త్రైమాసికంలో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. కొనుగోలుదారులు కుల్లినాన్ సిరీస్ II, బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్‌లను దేశంలోని రెండు షోరూమ్‌లలో చూడొచ్చు.. రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ చెన్నై, న్యూ ఢిల్లీలో ఉంది.

Show comments