Site icon NTV Telugu

Road Safety Shields: మీరు మీ ఫ్యామిలీ సేఫ్.. రోడ్లపై మరణాలకు చెక్ పెట్టే 5 సేఫ్టీ షీల్డ్స్!

Roads

Roads

Road Safety Shields: రోడ్డు ప్రమాదాలు ప్రస్తుతం కామన్‌గా మారిపోయాయి. మన దేశంలో రోడ్డు ప్రమాదంలో మరణించే వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎన్ని కఠిన నిబంధనలు విధించినా.. ఎన్ని రోడ్డు భద్రతా అంశాల గురించి వివరించిన ఎలాంటి ఫలితం లేకుండా పోతోంది. భారతీయ రోడ్లపై వాహనం నడపడం అంటే కేవలం డ్రైవింగ్ కాదు.. చాలాసార్లు అదృష్టాన్ని పరీక్షించుకోవడమే. మనవాళ్లలో ఎవరో ఒకరు బైక్ లేదా కారు తీసుకుని బయటకు వెళ్తే, మనసులో ఓ చిన్న భయం ఏర్పడుతుంది. వాళ్లు సురక్షితంగా తిరిగి వస్తారా లేదా అనే టెన్షన్ పెరిగిపోతుంది. కొన్నిసార్లు చెడు వార్తలు సైతం వింటుంటాం. హెల్మెట్ పెట్టుకోకపోవడం, అతివేగం, డ్రైవింగ్ చేస్తూ నిద్ర మత్తు లేదా ప్రమాదం అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతుంటారు. కొన్నిసార్లు డబ్బులు లేవన్న కారణంతోనూ ప్రాణాలు పోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన 5 సేఫ్టీ షీల్డ్స్ నిజంగా ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. అవేంటో చూద్దాం.

READ MORE: Father Kills Daughter: 50 వరకు అంకెలు రాయని నాలుగేళ్ల కూతురు.. కొట్టి చంపేసిన జైస్వాల్

1. డబుల్ హెల్మెట్
ఇకపై ద్విచక్ర వాహనం అంటే డబుల్ హెల్మెట్ తప్పనిసరి. అంటే ఇకపై బైక్ కొంటే రెండు ISI మార్క్ హెల్మెట్లను కంపెనీ ఇవ్వాలి. అయితే.. చాలా మంది ఇల్లు దగ్గరే కదా అని హెల్మెట్ పెట్టుకోరు. కానీ ప్రమాదం దూరం చూసి రాదు. తలకి గాయం కావడం వల్లే బైక్ ప్రమాదాల్లో ఎక్కువ చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. డ్రైవర్ మాత్రమే కాదు.. వెనక కూర్చున్నవాళ్లు కూడా హెల్మెట్ పెట్టుకుంటేనే ఇంటికి సేఫ్‌గా వెళ్లొచ్చు.

2. 5-స్టార్ సేఫ్టీ – కార్ అంటే స్టేటస్ కాదు, రక్షణ
ఇప్పుడు మన దేశంలోనే Bharat NCAP అనే కొత్త సేఫ్టీ పరీక్ష మొదలైంది. ఇకపై విదేశీ రేటింగ్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. 5-స్టార్ సేఫ్టీ రావాలంటే
కేవలం బలమైన కారు బాడీ సరిపోదు. 6 ఎయిర్‌బ్యాగ్స్, స్టేబిలిటీ కంట్రోల్ లాంటి ఫీచర్లు తప్పనిసరి. దీంతో కార్ కంపెనీలు ఇక భద్రతను విస్మరించలేవు. ఈ నిర్ణయంతో కారు అంటే షో కాదు.. ప్రాణాలను కాపాడే సాధనం అనే ఆలోచన బలపడుతుంది.

3.ADAS సిస్టమ్‌..

2026 ఏప్రిల్ నుంచి పెద్ద వాహనాల్లో కొన్ని స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లు తప్పనిసరి కానున్నాయి. ఇవే ADAS సిస్టమ్‌లు. డ్రైవర్ నిద్రపోతే ఆటో బ్రేక్ సిస్టమ్ ఆక్టివ్ అవుతుంది. ఇది డ్రైవర్‌కు సహాయం చేస్తుంది. భారతదేశంలో ఎక్కువ గంటలు డ్రైవ్ చేసే వాళ్లకు ఈ టెక్నాలజీ నిజంగా గేమ్ ఛేంజర్. ఖర్చు పెరుగుతుంది కానీ.. ప్రాణం కాపాడుతుంది.

4. ట్రక్ డ్రైవర్ కూడా మనిషే

2025 అక్టోబర్ నుంచి దేశంలో తయారయ్యే ప్రతి ట్రక్‌లో AC క్యాబిన్ తప్పనిసరి. ఇది విలాసం కోసం కాదు భద్రత కోసం. ఎండలో గంటల తరబడి డ్రైవ్ చేస్తే
అలసట, చిరాకు వల్ల ప్రమాదాలు పెరుగుతాయి. డ్రైవర్ యాక్టివ్‌గా ఉంటే సేఫ్‌గా డ్రైవ్ చేస్తారు. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు నితిన్ గడ్కరీ తెలిపారు. ట్రక్ డ్రైవర్ల పని చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటేనే ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ బలపడుతుంది.

5. ప్రమాదం తర్వాత… భయం కాదు, భరోసా
రోడ్డుపై ప్రమాదం జరిగితే మిగితా వాళ్లు చూసి చూడకుండా వెళ్లిపోతుంటారు. కారణం దయ లేకపోవడం కాదు.. చట్టాల సమస్యలు, చికిత్స ఖర్చుల భయం. అందుకే ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రులు గోల్డెన్ అవర్‌లో రూ.1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స అందించారు. దీంతో ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తికి డబ్బులు ఎవరు చెల్లిస్తారు? అనే భయం తగ్గుతుంది. ముందుకు వచ్చి సహాయం చేసే మనసు పెరుగుతుంది.

 

 

Exit mobile version