Rishabh Pant was driving Mercedes-AMG GLE 43 4MATIC Coupe, this car specifications: రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతనికి డెహ్రాడూన్ లోని మాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున రిషబ్ పంత్ కారు డివైడర్ ను ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు పల్టీలు కొట్టింది. ఆ తరువాత కారుకు మంటలు అంటుకున్నాయి. అయితే సమీపంలో ఉన్న వారు రిషబ్ పంత్ ను కారు నుంచి బయటకు తీసి రక్షించారు. పంత్ నిద్ర మత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్ లోని నర్సన్ వద్ద డివైడర్ని ఢీకొని మంటలు చెలరేగాయి.
అయితే అంత పెద్ద ప్రమాదం జరిగిన రిషబ్ పంత్ ప్రాణాలతో బతికి ఉన్నాడంటే దానికి మొదటి కారణం ఆ కారే. మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఈ అత్యాధునిక, విలాసవంతమైన కారు రిషబ్ ను పెద్దగా గాయాలు కాకుండా కాపాడింది. ప్రపంచంలో మెర్సిడెస్ బెంజ్ అత్యంత సురక్షితమైన కార్లను తయారు చేస్తుంది. చాలా మెర్సిడెస్ కార్ల మాదిరిగానే పంత్ నడుపుతున్న మెర్సిడెస్ AMG GLE 43 4MATIC కూపే కారు కూడా అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారు ప్రారంభ ధర దాదాపుగా రూ. 99 లక్షలుగా ఉంది.
Read Also: Rishab Shetty: రష్మికకి మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రిషబ్…
కారు ప్రత్యేకతలివే..
మెర్సిడెస్-AMG GLE 43 4MATIC కూపే అమ్మకాలను ప్రస్తుతం భారతదేశంలో నిలిపివేశారు. అయితే ఈ కారులో మల్టీపుల్ ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి. దీంతో పాటు మెర్సిడెస్ ఎల్ఈడీ ఇంటెలిజెంట్ లైట్ సిస్టమ్, కో-డ్రైవర్ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్, అటెన్షన్ అసిస్ట్ అండ్ ప్రీ సెఫ్టీ సిస్టమ్స్ ఉన్నాయి. స్టీరింగ్ అసిస్ట్, ప్రీ-సేఫ్ బ్రేక్, ప్రీ-సేఫ్ ప్లస్, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్‌తో కూడిన క్రాస్-ట్రాఫిక్ అసిస్ట్, యాక్టివ్ లేన్ కీపింగ్ అసిస్ట్, యాక్టివ్ బ్లైండ్ స్పాట్ ప్రొటెక్షన్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
ఇక ఇంజన్ విషయాని వస్తే కూపే 3.0 లీటర్ వీ6 డైరెక్ట్ ఇంజెక్షన్ బై-టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. 390 హార్స్ పవర్ తో 520 న్యూటన్ మీటర్ గరిష్ట టార్క్ అందిస్తుంది. 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఫోర్ వీల్ డ్రైవ్ కలిగి ఉంది. కేవలం 5.7 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. ఈ కార్ గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉంది.