NTV Telugu Site icon

Hyundai: సెప్టెంబర్‌లో హ్యుందాయ్ రికార్డ్ సేల్స్.. కలిసి వచ్చిన ఫెస్టివల్ సీజన్..

Hyundai

Hyundai

Hyundai: కొరియన్ కార్ మేకర్ హ్యుందాయ్ రికార్డ్ సేల్స్‌తో దూసుకుపోతోంది. కంపెనీ ప్రారంభమైన తర్వాత ఈ సెప్టెంబర్ లోనే రికార్డు అమ్మకాలు జరిపింది. ముఖ్యంగా ఎస్‌యూవీ విభాగంలో కార్ల అమ్మకాల్లో పెరుగుదల ఓవరాల్‌గా హ్యుందాయ్ కంపెనీకి ప్లస్ అయ్యాయి. ప్రస్తుతం హ్యుందాయ్ కంపెనీ నుంచి ఎస్‌యూవీ పోర్టుఫోలియోలో ఎక్స్‌టర్, వెన్యూ, క్రేటా, అల్కజర్, టక్సన్ కార్ మోడల్స్ ఉన్నాయి.

సెప్టెంబర్ నెల (దేశీయ+ఎగుమతి)లో హ్యుందాయ్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా ఈ నెలలో 13.35 శాతం పెరుగుదలను నమోదు చేసింది. సెప్టెంబర్ 2023లో ఏకంగా 71,641 యూనిట్లను అమ్మింది. ఇదే నెలలో గతేడాది 63,201 యూనిట్లను సేల్ చేసింది. హ్యుందాయ్ సీఓఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. కంపెనీ ప్రారంభమైన నుంచి అత్యధిక మొత్తంలో నెలవారీ అమ్మకాలనను సాధించామని, ఇది బ్రాండ్ చరిత్రలోనే కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.

Read Also: JNU: జేఎన్‌యూ గోడలపై ‘ఫ్రీ కాశ్మీర్’, ‘భారత ఆక్రమిత కాశ్మీర్’ స్లోగన్స్.. చర్యలకు ఏబీవీపీ డిమాండ్..

హ్యుందాయ్ సెప్టెంబర్ నెలలో దేశీయంగా 54,241 యూనిట్లను విక్రయిస్తే, 2022లో 49,700 యూనిట్లను విక్రయించింది. అమ్మకాలకు ఫెస్టివల్ సీజన్ కూడా కలిసివస్తోంది. 2023 సెప్టెంబర్ నెలలో దేశీయ విక్రయాల్లో 9 శాతం కన్నా ఎక్కువ వృద్ధిని సాధించింది. ఎస్‌యూవీ సెగ్మెంట్ లోనే 65 శాతం కంటే ఎక్కువ అమ్మకాలు నమోదయ్యాయి. కంపెనీ ఎగుమతులు సెప్టెంబర్ 2023లో 28.87 శాతం పెరిగి 17,400కి చేరుకుంది. సెప్టెంబర్ 2022లో ఇది 13,501 యూనిట్లుగా ఉంది.

Show comments