Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
- భారత్-యూకే FTA ప్రభావం.. లగ్జరీ కార్ల ధరల్లో మార్పు
- రేంజ్ రోవర్ SV, స్పోర్ట్ SVపై భారీ ధర తగ్గింపు
- కొత్త ఫీచర్లతో మరింత ప్రీమియం అనుభవం
- ఏ మోడల్స్‌పై ప్రభావం లేదు..? కంపెనీ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Range Rover SV : భారతదేశంలో లగ్జరీ కార్ల మార్కెట్లో కీలక మార్పు చోటుచేసుకుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఇండియా తన ఫ్లాగ్షిప్ మోడల్స్ అయిన రేంజ్ రోవర్ SV, రేంజ్ రోవర్ స్పోర్ట్ SV ధరలను గణనీయంగా తగ్గించింది. భారత్-యూకే మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ చర్యతో దిగుమతి సుంకాల్లో లభించిన ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ధరల్లో భారీ తగ్గింపు.. కస్టమర్లకు లాభం
Also Read
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
- Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
తాజా ధరల ప్రకారం రేంజ్ రోవర్ SV ధరను రూ.4.25 కోట్ల నుంచి రూ.3.50 కోట్లకు తగ్గించారు. అంటే ఈ మోడల్‌పై నేరుగా రూ.75 లక్షల వరకు కోత విధించారు. అలాగే రేంజ్ రోవర్ స్పోర్ట్ SV ధరను రూ.2.75 కోట్ల నుంచి రూ.2.35 కోట్లకు తగ్గిస్తూ రూ.40 లక్షల తగ్గింపు ఇచ్చారు. ఈ కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. దీంతో లగ్జరీ SUV కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది పెద్ద అవకాశంగా మారింది.
రేంజ్ రోవర్ SVలో కొత్త ఫీచర్లు
ధర తగ్గింపుతో పాటు రేంజ్ రోవర్ SV మోడల్లో కంపెనీ కొన్ని కొత్త ఫీచర్లను కూడా జోడించింది. ఇప్పుడు ఇందులో SV Ultra Metallic పెయింట్ ఆప్షన్ స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటుంది. ఇది గ్లోస్ , సాటిన్ ఫినిష్‌లలో లభ్యమవుతూ వాహనానికి మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. JLR ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబా మాట్లాడుతూ, ఈ నిర్ణయం పూర్తిగా కస్టమర్ ఫస్ట్ విధానంతో తీసుకున్నదని వెల్లడించారు.
ఈ మోడల్స్‌పై ప్రభావం ఉండదు
ఈ ధరల తగ్గింపు యూకే నుంచి పూర్తిగా దిగుమతి అయ్యే (CBU) మోడల్స్‌కే వర్తిస్తుంది. భారత్‌లో అసెంబుల్ చేసే రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఇవోక్, రేంజ్ రోవర్ వెలార్, డిస్కవరీ స్పోర్ట్ వంటి మోడల్స్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. అలాగే స్లోవాకియాలో తయారయ్యే ల్యాండ్ రోవర్ డిఫెండర్, ల్యాండ్ రోవర్ డిస్కవరీ మోడల్స్ కూడా ప్రస్తుతం ఉన్న ధరలకే కొనసాగుతాయి. ఈ నిర్ణయం ద్వారా జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా మార్కెట్లో మరింత పోటీగా నిలవాలని చూస్తోంది. ధరలు తగ్గడంతో పాటు ఫీచర్లను మెరుగుపరచడం ద్వారా మరింత మంది కస్టమర్లను ఆకర్షించాలనే వ్యూహంతో కంపెనీ ముందుకు సాగుతోంది.
తాజావార్తలు
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!