Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- రేంజ్ రోవర్ స్పోర్ట్ లైనప్‌లో తొలి ఎలక్ట్రిక్ మోడల్ బుకింగ్స్ ప్రారంభం..
- ఒక్క ఛార్జ్‌తో 609 కిలోమీటర్ల రేంజ్..
- ధర రూ. 2.5 కోట్లు అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Range Rover Sport Electric: JLR (జాగ్వార్ ల్యాండ్ రోవర్) రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్‌ను ఆవిష్కరించింది. ఈ SUV కోసం బుకింగ్స్ ప్రారంభయ్యాయి. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ లైనప్‌లో ఇది తొలి ఎలక్ట్రిక్ మోడల్. ఇందులో 118.5kWh బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తున్నారు. ఇది ఒక్క ఛార్జ్‌తో 609 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీల పేర్కొంటోంది. ఈ ఎలక్ట్రిక్ SUV రెండు మోటార్లతో ఆల్-వీల్ డ్రైవ్(AWD)తో వస్తోంది. 550 hp పవర్, 850 Nmను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ICE వెర్షన్ రేంజ్ రోవర్ స్పోర్ట్‌లోని V8 ఇంజన్ మోడల్‌తో తీసుపోని విధంగా పవర్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్‌ను 00-వోల్ట్ ఫ్లెక్సిబుల్ మాడ్యులర్ లాంగిట్యూడినల్ ఆర్కిటెక్చర్‌పై నిర్మించారు. ఇందులోని బ్యాటరీపై 8 ఏళ్ల లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.5 సెకన్లలోనే అందుకుంటుంది. 350kW వరకు DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో 10 శాతం నుంచి 80 శాతం వరకు బ్యాటరీని కేవలం 22 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. 10 నిమిషాల ఛార్జింగ్‌తోనే 220 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది.
Also Read
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
- Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
ఇక లగ్జరీ, ఇంటీరియర్ విషయంలో ఈ కారు మరింత అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది. కొత్తగా వస్తున్న ఎలక్ట్రిక్ మోడల్, ICE వెర్షన్‌ను దాదాపుగా పోలి ఉంటుంది. క్యాబిన్లో 3-స్పోక్ స్టీరింగ్ వీల్, టచ్-సెన్సిటివ్ కంట్రోల్స్ ఉన్నాయి. 13.1 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్, 13.7 అంగుళాల డ్రైవర్ డిస్ప్లే ఉంటుంది. హీటెడ్, వెంటిలేడెట్ పవర్డ్ సీట్లు, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, రియర్ సన్‌బ్లైండ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. దీనిని వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేసే అవకాశం ఉంది. దీని ధర సుమారుగా రూ. 2.5 కోట్లు ఉంటుందని అంచనా.
తాజావార్తలు
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
-
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!