NTV Telugu Site icon

Okaya EV Scooter : ఒకయా నుంచి మరో కొత్త స్కూటర్..లుక్ మాములుగా లేదు..

Okaya Classiq

Okaya Classiq

ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది.. ప్రభుత్వాలు కూడా వీటినే అధికంగా ప్రోత్సహిస్తున్నాయి. మన దేశంలో కూడా నెమ్మదిగా వీటి వినియోగం పెరుగుతోంది. అర్బన్ ఏరియాల్లో ఇలాంటి స్కూటర్లు బెస్ట్ అనే చెప్పాలి.. ఇక ప్రముఖ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ వేరియంట్ స్కూటర్లను మన దేశంలో విరివిగా లాంచ్ చేస్తున్నాయి. తక్కువ బడ్జెట్లో స్కూటర్లను అందించే ఒకాయా కంపెనీ కూడా మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఒకాయా ఈవీ స్కూటర్లకు మంచి మార్కెట్ ఉంది. వీటిని మరింత పెంచకునేలా స్టైలిష్ డిజైన్ తో ఒకాయా మోటో ఫాస్ట్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేస్తోంది.. ఆ స్కూటర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..

ఇప్పటికే ఉన్న ఫాస్ట్ ఎఫ్2బీ, ఫాస్ట్ ఎఫ్2టీ వేరియంట్లకు తోడు అదనంగా మోటో ఫాస్ట్ను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ స్కూటర్లో అడ్వాన్స్ డ్ ఫీచర్లు ఉన్నాయి. ఇది కేవలం పర్యావరణ హితమైనదే కాకుండా స్టైల్, పనితీరులో కూడా అత్యద్భుతంగా ఉంటుంది.. మన రోడ్లకు తగ్గట్లుగా అదిరిపోయే టెక్నాలజీ తో వస్తుంది.. గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. పట్టణ ప్రాంతాలకు సరిగ్గా సరిపోతోంది. ముఖ్యంగా ట్రాఫిక్ ప్రాంతాల్లో అనువైన డ్రైవింగ్ ను అందిస్తుంది.. ఈ స్కూటర్ సింగిల్ చార్జ్ 120 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఎక్స్ టెండెడ్ రేంజ్ కూడా ఉంటుంది. ఇది వీకెండ్స్ లో లాంగ్ ట్రిప్స్ కి వెళ్లడానికి బెస్ట్ అనే చెప్పాలి..

ఓవర్ హీటింగ్ సమస్య లేకుండా అదనపు భద్రతను అందిస్తుంది. ఇది అధిక సంవత్సరాల లైఫ్ ను అందిస్తాయి.. వెయిట్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇది స్టైలిష్ లుక్ ని అందిస్తాయి. ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్ ఉంటుంది. మల్టీ మీడియా ఆప్షన్లు ఉంటాయి.. వచ్చే నెలలో దీనిని గ్రాండ్ గా లాంచ్ చెయ్యనున్నారు. ఇకపోతే ఈ స్కూటర్ బ్లాక్, సియాన్, గ్రీన్, గ్రే, రెడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 1లక్ష నుంచి రూ. లక్షా ఏబై లోపే ఉంటుందని సమాచారం..