Site icon NTV Telugu

Mukesh Ambani: ముకేష్ అంబానీ అంటే మామూలుగా ఉండదు.. భార్యకు రూ. 10 కోట్ల కార్ గిఫ్ట్..

Neeta Ambani

Neeta Ambani

Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఏం చేసినా రిచ్‌గానే ఉంటుంది. ముంబైలోని అంబానీ నివాసం ‘ ఆంటిలియా’ ప్రపంచంలోనే ఖరీదైన నివాసాల్లో ఒకటిగా ఉంది. ఇక కార్ల విషయానికి వస్తే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లు అంబానీ కలెక్షన్‌లో ఉన్నాయి. రోల్స్ రాయిస్, బెంజ్, BMW, ఫెరారీ, బెంట్లీ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తంగా 150 కన్నా ఎక్కువ కార్లే ముకేష్ అంబానీ గ్యారేజ్ లో ఉంటాయి. వీటితో పాటు రెండు బుల్లెట్ ఫ్రూఫ్ కార్లు ఉన్నాయి.

Read Also: South Korea: మనిషిని చంపిన రోబోట్..

ఈ కార్ల గురించి పక్కన పెడితే.. తన భార్య నీతా అంబానీకి ముకేష్ అంబానీ అదిరిపోయే దీపావళి గిఫ్టు ఇచ్చారు. ఏకంగా రూ.10 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ ఎడిషన్ కారును అందించారు. దీని ధర రూ.8.2 కోట్లు (ఎక్స్-షోరూం)గా ఉంది. రిజిస్ట్రేషన్, ఆన్ రోడ్ కలుపుకుని దీని ధర రూ.10 కోట్లు ఉంటుంది. ఆరెంజ్ షేడ్‌లో నీతా అంబానీ కొత్త కుల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ ఉంది. ముకేష్ అంబానీకి కూడా పెట్రాగోల్డ్ షేడ్ కలిగిన కుల్లినాన్ ఉంది.

తన భార్యకు గిఫ్టుగా ఇచ్చిన కుల్లినాన్ కారు 6.75 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V12 పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. 600 పీఎస్ పవర్‌తో 900 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. గంటకు దీని గరిష్ట వేగం 250 కిలోమీటర్లు. ఇండియాలో రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ కారుని ముకేష్ అంబానీనే కాకుండా బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూడా కలిగి ఉన్నాడు. కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ ప్రస్తుతం రోల్స్ రాయిస్ ఫ్లాగ్ షిప్ కార్లలో ఒకటి.

Exit mobile version