Nissan Magnite facelift: నిస్సాన్ మోటార్ ఇండియా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ మాగ్నైట్‌ని కొత్త అవతార్‌లో తీసుకురాబోంది. నిన్సాన్ మాగ్నైట్ ప్రస్తుతం ఇండియా మార్కెట్‌లో మంచి సేలింగ్స్‌ని నమోదు చేస్తోంది. ఇప్పటికీ ఈ కార్ విడుదలై నాలుగేళ్లు గడిచింది. ఇదిలా ఉంటే తాజాగా నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ రిలీజ్ కాబోతోంది. అక్టోబర్ 04న ఫేస్‌లిఫ్ట్‌ని భారత మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. నిస్సాన్ ఫేస్‌లిఫ్ట్‌లో ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్లలో భారీగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అయితే, పవర్‌ట్రెయిన్స్ మాత్రం గతంలో ఉన్న కారు మాదిరిగానే ఉండబోతున్నాయి.
Read Also: Crime: పాత బాయ్ ఫ్రెండ్ తిరిగి రావడంతో.. కొత్త స్నేహితుడైన ఎస్సైని హత్య చేసిన మహిళా కానిస్టేబుల్..
రెండు ఇంజన్ల ఆప్షన్లని కలిగి ఉంటుంది. B4D 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 72 పీఎస్ పవర్, 96 ఎన్ఎం టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. HRAO 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 100 పీఎష్, 160/152 ఎన్ఎం టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. B4D 1.0-లీటర్ యూనిట్ 5-స్పీడ్ MT మరియు 5-స్పీడ్ AMT ఎంపికలను కలిగి ఉంటుంది, అయితే HRAO 1.0-లీటర్ యూనిట్ 5-స్పీడ్ MT, CVT ఆప్షన్లను కలిగి ఉంటుంది.
ప్రస్తుతం నిస్సాన్ మాగ్నైట్ ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభమై రూ. 11.11 లక్షలు(ఎక్స్-షోరూం)గా ఉంది. కొత్త నిస్సాన్ మాగ్నైట్ ధర రూ. 6.5 లక్షల నుంచి రూ. 11.50 లక్షలు(ఎక్స్-షోరూం)గా ఉంటుందని అంచనా. నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్‌లోని సిట్రోయెన్ బసాల్ట్, మారుతి సుజుకీ ప్రాంక్స్, రెనాల్ట్ కిగర్, హ్యుందాయ్ ఎక్స్‌టర్, టాటా పంచ్‌లకు పోటీని ఇవ్వనుంది.