NTV Telugu Site icon

Hyundai Creta: రికార్డు సృష్టిస్తున్న హ్యుందాయ్ క్రెటా..

Hyundai Creta

Hyundai Creta

Hyundai Creta: మిడ్ సైజ్ SUV విభాగంలో హ్యుందాయ్ క్రెటా అదరగొడుతోంది. ఈ విభాగంతో ఇతర కంపెనీ కార్లతో పోలిస్తే క్రెటా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో క్రెటా నుంచి ఫేస్‌లిఫ్ట్ వచ్చినప్పటి నుంచి నెలవారీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. బలమైన డిమాండ్ కలిగిన ఈ కారు అమ్మకాల్లో రికార్డు క్రియేట్ చేస్తోంది. హ్యుందాయ్ క్రెటా జూలై 2024లో 17,350 యూనిట్లను విక్రయించింది. 2015లో భారత మార్రెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కారు, ఈ ఏడాది జూలై నెలలోనే అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. మిడ్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలో భారతదేశంలోని అత్యుత్తమ అమ్మకాల రికార్డుని సృష్టించింది.

ప్రస్తుతం క్రెటా తన సెకండ్ జనరేషన్‌లో ఉండగా, జనవరి 2024లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వచ్చింది. ఏడు నెలల్లోనే ఇది 1,00,000 యూనిట్లకు పైగా విక్రయించబడింది. హ్యుందాయ్ క్రెటా కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైర్డర్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి కార్లకు ప్రత్యర్థిగా ఉంది. త్వరలో రాబోతోన్న టాటా కర్వ్‌‌కి కూడా పోటీదారుగా ఉంటుంది.

Read Also: Bangladesh: బంగ్లాదేశ్ లో మళ్లీ హింస..సోషల్ మీడియాపై తాత్కాలిక నిషేధం

ADAS వంటి భద్రతా ఫీచర్లతో పాటు టెక్ లోడెడ్‌గా రావడంతో ఎక్కువ మంది క్రెటాను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో పాటు మల్టీ పవర్‌ట్రెయిన్ ఛాయిసెస్ కూడా ఉండటం కూడా దీనికి ప్లస్ అవుతోంది. హ్యుందాయ్ క్రెటా ధర రూ. 11 లక్షలతో మొదలై రూ. 20.15 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ ధర రూ. 16.82 లక్షల నుండి రూ. 20.45 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

6-స్పీడ్ MT లేదా IVT ఆటోమేటిక్‌తో 1.5-లీటర్ MPi పెట్రోల్ ఇంజన్, 7-స్పీడ్ DCT ఆటోమేటిక్‌తో కూడిన 1.5-లీటర్ కప్పా టర్బో GDi పెట్రోల్ ఇంజన్, 6-స్పీడ్ MT లేదా 6-స్పీడ్ AT కలిగిన 1.5-లీటర్ U2 CRDi డీజిల్ ఇంజన్లు అందుబాటులో ఉన్నాయి. N లైన్ 6-స్పీడ్ MT మరియు 7-స్పీడ్ DCT ఎంపికలతో 1.5-లీటర్ కప్పా టర్బో GDi పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది.

హ్యుందాయ్ క్రెటా యొక్క టాప్ ఫీచర్లలో వాయిస్-ఎనేబుల్డ్ పనోరమిక్ సన్‌రూఫ్, ముందు వరుస వెంటిలేటెడ్ సీట్లు, 8-వే పవర్డ్ డ్రైవర్ సీట్, సరౌండ్ వ్యూ మానిటర్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ మరియు ఎనిమిది స్పీకర్లతో బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ లెవల్ 2 ADAS కూడా ఉంది. 36 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో సహా 70కి పైగా సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, నాలుగు డిస్క్ బ్రేక్‌లు, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్‌తో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (హైలైన్) స్టాండర్డ్‌గా కలిగి ఉంది.

Show comments