402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Mini Cooper SE Launched in India: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మినీ (Mini) భారత మార్కెట్లోకి కొత్త జనరేషన్ Cooper SE ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. అలాగే బ్రిటిష్ ఫ్యాషన్ డిజైనర్ పాల్ స్మిత్‌తో కలిసి రూపొందించిన మూడు ప్రత్యేక ఎడిషన్లను కూడా పరిచయం చేసింది. ఈ లాంచ్ కార్యక్రమానికి బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ హాజరయ్యారు. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. డిసెంబర్ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
కొత్త Mini Cooper SEలో 54.2 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇందులో అమర్చిన ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ 218 హెచ్‌పీ పవర్, 330 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 6.7 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. WLTP ప్రమాణాల ప్రకారం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 402 కి.మీ. ప్రయాణించవచ్చు. ఛార్జింగ్ విషయానికి వస్తే.. 11 kW AC, 95 kW DC ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. AC ఛార్జర్‌తో బ్యాటరీని 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయడానికి 5.25 గంటలు పడుతుంది. DC ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 30 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.
Also Read
- 355 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో జనవరి 16న రాబోతున్న Hyundai Ioniq P..!
- 200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!
- 750cc ట్విన్ సిలిండర్ ఇంజిన్, 55 PS పవర్, 63 Nm టార్క్.. Royal Enfield Himalayan 750 లాంచ్..!
- రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
డిజైన్ పరంగా రౌండ్ LED హెడ్‌ల్యాంప్స్, ఆక్టాగనల్ గ్రిల్, కాంట్రాస్ట్ రూఫ్ ఫినిషింగ్ ఉన్నాయి. వెనుకవైపు త్రిభుజాకార LED టెయిల్ ల్యాంప్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంటీరియర్‌లో 9.4 అంగుళాల సర్క్యులర్ OLED టచ్‌స్క్రీన్‌ను అందించారు. అలాగే హెడ్అప్ డిస్ప్లే, పనోరమిక్ గ్లాస్ రూఫ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, హీటెడ్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో పాటు Level 2 డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.53.90 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్) నిర్ణయించారు.
Mini Cooper SE Paul Smith Edition ధర రూ.56.40 లక్షలుగా నిర్ణయించారు. సాధారణ మోడల్‌తో పోలిస్తే దీని ధర రూ.2.50 లక్షలు ఎక్కువ. ఇన్స్పైర్డ్ వైట్, మిడ్ నైట్ బ్లాక్, స్టేట్మెంట్ గ్రే రంగుల్లో ఈ ప్రత్యేక ఎడిషన్ లభిస్తుంది. ఇందులో 18 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్, పాల్ స్మిత్ లోగోలు, ప్రత్యేక రూఫ్ డిజైన్, కలర్‌ఫుల్ స్ట్రైప్ డీటెయిలింగ్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో బ్లూ కాంట్రాస్ట్ స్టిచింగ్, స్టీరింగ్ వీల్‌పై కలర్‌ఫుల్ స్ట్రైప్స్, ‘హలో’ అనే పదంతో వెలిగే వెల్కమ్ లైట్ ప్రొజెక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. డోర్ సిల్ గార్డులపై ‘Every day is a new beginning’ అనే సందేశాన్ని అందించారు. ఫ్లోర్ మ్యాట్స్‌పై చేతితో గీసిన కుందేలు బొమ్మ ఉంటుంది. అయితే ఈ ప్రత్యేక ఎడిషన్‌లో బ్యాటరీ, మోటార్ పవర్, ఛార్జింగ్ సామర్థ్యాల్లో ఎలాంటి మార్పులు లేవు.
పెట్రోల్ మోడళ్ల విషయానికి వస్తే.. Cooper S Paul Smith Edition ధర రూ.55.75 లక్షలు కాగా, Cooper Convertible Paul Smith Edition ధర రూ.61.50 లక్షలుగా నిర్ణయించారు. ఈ రెండు మోడళ్లలోనూ ప్రత్యేక రంగులు, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, పాల్ స్మిత్ సిగ్నేచర్ డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. Cooper Sలో నాటింగ్‌హామ్ గ్రీన్ రూఫ్, కాంవెర్టిల్లో బ్లాక్ ఫ్యాబ్రిక్ రూఫ్‌ను అందించారు. మినీ కూపర్ S, కూపర్ కాంవెర్టిల్ పాల్ స్మిత్ ఎడిషన్లలో 2.0 లీటర్, నాలుగు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఇది 204 హెచ్‌పీ పవర్, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా ముందు చక్రాలకు పవర్ అందుతుంది.
Cooper S కేవలం 6.6 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. కాంవెర్టిల్ మోడల్‌కు ఇదే వేగాన్ని చేరుకోవడానికి 6.9 సెకన్లు పడుతుంది. Convertibleలో వన్‌టచ్ ఆపరేషన్‌తో పనిచేసే ఫ్యాబ్రిక్ రూఫ్‌ను అందించారు. గంటకు 30 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ 18 సెకన్లలో రూఫ్‌ను తెరవడం లేదా మూసివేయడం సాధ్యమవుతుంది. కొత్త Mini Cooper SE Paul Smith Edition ధర రూ.56.40 లక్షలుగా నిర్ణయించారు.
తాజావార్తలు
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
Delimitation Bill: డీలిమిటేషన్ బీజేపీ రాజకీయ కుట్ర.. ఏపీకి 25 ఎంపీ సీట్ల నష్టం..!
-
Rohit Sharma: “తొలుత కెప్టెన్సీ వద్దనుకున్న.. అతడు చెప్పడంతోనే అంగీకరించా”.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..
-
Story Board: డీలిమిటేషన్‌పై కేంద్రం పట్టుదల.. అండగా నిలిచేదెవరు..?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
ట్రెండింగ్
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
-
Rishabh Pant: WTC చరిత్రలో ‘రిషబ్ పంత్’ సరికొత్త చరిత్ర..!
-
355 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో జనవరి 16న రాబోతున్న Hyundai Ioniq P..!
-
200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!