Maruti Suzuki sales: మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి కంపెనీలు సోమవారం నవరాత్రి పండుగను ఘనంగా జరుపుకున్నాయి. కొత్త జీఎస్టీ సంస్కరణ అమల్లోకి రావడంతో రికార్డు అమ్మకాలను నమోదు చేశాయి. భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సోమవారం 25,000 యూనిట్లకు పైగా రిటైల్ అమ్మకాలను నమోదు చేసింది. త్వరలో 30,000 యూనిట్లను దాటే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేసింది. సోమవారం దాదాపు 80,000 కస్టమర్ తమ కార్లను పరిశీలించేందుకు వచ్చారని కంపెనీ తెలిపింది.
READ MORE: Madanapalle : ఒకసారిగా భారీగా పతనమైన టమాటా ధర.. మదనపల్లె మార్కెట్ షాక్
“కస్టమర్ల నుంచి వచ్చిన స్పందనకు మేము ఆశ్చర్యపోయాం. గత 35 సంవత్సరాలలో ఎన్నాడూ చూడలేదు. మొదటి రోజే 25,000 కార్లను డెలివరీ చేశాం. ఈ డెలివరీలు త్వరలో 30,000కి చేరుకుంటాయని అంచనా” అని మారుతి సుజుకి మార్కెటింగ్, అమ్మకాల సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ చెప్పారు. GST 2.0 ప్రకటన తర్వాత.. మారుతి సుజుకి కంపెనీ ఇప్పటివరకు 75,000 బుకింగ్‌లను అందుకుంది. ప్రతిరోజూ దాదాపు 15,000 బుకింగ్‌లు వస్తున్నాయని కంపెనీ తెలిపింది. సాధారణ రోజుల కంటే ఇది దాదాపు 50% ఎక్కువ. చిన్న కార్లకు డిమాండ్ భారీగా ఉంది. కొన్ని వేరియంట్‌లకు సంబంధించి స్టాక్ అయిపోవస్తోంది. ప్రస్తుతం కష్టమర్ల రద్దీ దృష్ట్యా డెలవరీలు రాత్రి వరకూ జరుగుతాయి.
మరోవైపు.. దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ GST 2.0 అమలు చేసిన మొదటి రోజు సోమవారం 10,000 డెలివరీలను నమోదు చేసినట్లు ప్రకటించింది. మరో ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా నవరాత్రి మొదటి రోజున 11,000 డీలర్ బిల్లింగ్‌లను నమోదు చేసింది. ఇది గత ఐదు సంవత్సరాల్లో ఇదే అధికమని కంపెనీ తెలిపింది.
