Motorola Signature: భారత్లో బడ్జెట్ ఫోన్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న మోటరోలా.. త్వరలోనే కొత్త ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైనప్ ను పరిచయం చేయబోతున్నట్లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) విడుదల చేసిన తాజా టీజర్ ద్వారా తెలుస్తుంది. ఇక, తన యాప్‌లో మాత్రమే యాక్సెస్ చేయగలిగేలా ఓ మైక్రోసైట్‌ను సైలెంట్‌గా లైవ్ చేసింది. ఇందులో “Signature Class is Coming Soon!” అనే క్యాచ్‌ఫ్రేజ్‌తో పాటు బ్రాండ్ పేరును నేరుగా ప్రస్తావించకుండా Motorola DNAను ప్రతిబింబించే క్లూస్ వాడటం విశేషం.
Read Also: Honour Killing: కూతురికి పురుగుల మందు తాగించి.. గొంతు నులిమి హత్య చేసిన తల్లిదండ్రులు!
ఫ్లిప్‌కార్ట్ టీజర్‌తో హింట్స్:
* ఫ్లిప్‌కార్ట్ యాప్-ఒన్లీ మైక్రోసైట్ ద్వారా “Signature” సిరీస్ గురించి హింట్..
* Motorola Batwing Logo, Pantone Color Partnership లాంటి విజువల్ క్లూస్ కనిపించాయి..
* బ్రాండ్‌ను కరెక్ట్‌గా గెస్ చేసిన తర్వాత “28th Decకు తిరిగి రండి” అనే మెసేజ్ డిస్‌ప్లే అవుతోంది.. దీంతో డిసెంబర్ 28, 2025న Motorola లేదా Flipkart నుంచి అధికారిక రివీల్ ఉండొచ్చని అంచనాలు పెరిగాయి. కాగా, ఈ టీజర్ గతవారం లీకైన Motorola Signature (Urus) ఫోన్ రెండర్స్ తరువాత రావడంతో, టెక్ వర్గాల్లో చర్చ మరింత ఆసక్తి పెరిగింది.
Read Also: Huawei Maextro S800: రిలీజైన కొన్ని నెలల్లోనే సంచలనం.. ఈ చైనీస్ కారు అందరినీ ఆశ్చర్యపరిచింది..
Edge 70 Ultra కాదు.. ‘Motorola Signature’ కొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్‌గా మారుతుందా?
* లీక్స్ ప్రకారం ఈ ఫోన్ కోడ్‌నేమ్: Urusగా ఉన్నట్లు తెలుస్తుంది.
* Motorola Edge 70 Ultra పేరుతో మొదట లాంచ్ అవుతుందని రూమర్స్.. కానీ తాజా లీక్స్ ప్రకారం “Motorola Signature” బ్రాండింగ్‌తో పూర్తిగా కొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్‌కు Motorola శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.
* Carbon, Martini Olive లాంటి ప్రీమియం కలర్ వేరియంట్స్ ఉండొచ్చని సమాచారం.
* ప్రముఖ టిప్‌స్టర్ Evan Blass షేర్ చేసిన రెండర్‌లో Carbon Variant కనిపించింది. అదే రెండర్‌లో Stylus కూడా ఉండటం వల్ల ఈ ఫోన్ Stylus Input Support తో వస్తుందని తెలుస్తోంది.
స్పెసిఫికేషన్స్ (Expected):
డిస్‌ప్లే:
* 6.7-అంగుళాల Flat OLED
* 1.5K Resolution
* 120Hz Refresh Rate
పర్ఫామెన్స్:
* Qualcomm Snapdragon 8 Gen 5 SoC
* 16GB వరకు RAM
* Android 16 OS
కెమెరా:
* వెనుక Square Camera Module
* Triple Camera + LED Flash
* మూడు కెమెరాలు కూడా 50MP Sensors
* మెయిన్ కెమెరా Sony Lytia Sensor + OIS Support
డిజైన్:
* మెటల్ ఫ్రేమ్
* హోల్-పంచ్ ఫ్రంట్ డిస్ప్లే
* టెక్స్చర్డ్ బ్యాక్ ప్యానెల్ + మోటరోలా బ్రాండింగ్
మోటరోలా కొత్తగా తీసుకొస్తున్న “Signature” బ్రాండింగ్ సిరీస్.. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రీమియం ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న Galaxy S Ultra, iQOO, One Plus, Pixel వంటి ప్రీమియం ఫోన్లకు.. Motorola నుంచి ఇది బలమైన పోటీగా మారొచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే, డిసెంబర్ 28వ తేదీన వచ్చే అప్‌డేట్‌తో ఈ లాంచ్ ప్లాన్‌పై మోటరోలా అధికారికంగా స్పష్టత ఇవ్వనుందని అందరూ ఎదురు చూస్తున్నారు.
Normally I don't take requests, but what the heck. Merry Xmas! https://t.co/E3X70ZA2X7 pic.twitter.com/PKQ48gAiBT
— Evan Blass (@evleaks) December 25, 2025
