Montra E-27 Tractor Launch: భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వచ్చేసింది.. సింగిల్ ఛార్జింగ్‌పై 4.5 గంటల రన్‌టైమ్!
- రైతులకు ప్రతి సీజన్ ఓ సవాలే
- పెను భారంగా మారుతున్న పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు
- భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వచ్చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశానికి వెన్నెముకైన రైతులకు ప్రతి సీజన్ ఓ సవాలే. ముఖ్యంగా పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు పెను భారంగా మారుతున్నాయి. విత్తనాలు విత్తడం నుంచి పంటలు కోయడం వరకు.. రైతులకు ఖర్చులు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో డీజిల్ ధర పెరగడం కూడా రైతు లాభాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కానీ ఇప్పుడు డీజిల్ అవసరం లేని ట్రాక్టర్ భారత మార్కెట్లోకి వచ్చింది. బ్యాటరీలతో నడిచే ఎలక్ట్రిక్ ‘మోంట్రా E27’ ట్రాక్టర్ ఫుల్ డీటెయిల్స్ ఓసారి తెలుసుకుందాం.
మోంట్రా ఎలక్ట్రిక్ విభాగం ఉత్తర భారతదేశంలో తన మొట్టమొదటి ARAI-సర్టిఫైడ్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ E-27ను విడుదల చేసింది. అత్యంత శక్తివంతమైన, అధునాతన సాంకేతికతతో వచ్చిన మోంట్రా E27 ట్రాక్టర్‌లో పొగ, శబ్దం అసలే ఉండవు. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ధర రూ.10.75 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం 10 రాష్ట్రాలలో 17 డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది. రైతులకు సులభమైన ఆర్థిక సౌకర్యాలను అందించడానికి కంపెనీ అనేక సంస్థలతో చేతులు కలిపిందని కంపెనీ సీఈఓ హరీష్ ప్రసాద్ తెలిపారు. ఈ ట్రాక్టర్ ప్రత్యేకత ఏమిటంటే.. టూ-వీల్ డ్రైవ్ (2WD), ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) రెండు ఎంపికలలో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను ఉపయోగిస్తే.. రైతులు 5 సంవత్సరాలలో రూ.10 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
Also Read
- BYD Sealion 7 Dynamic Launch: BYD సీలియన్ 7 డైనమిక్ విడుదల.. 71.8kWh బ్యాటరీ, 520KM రేంజ్.. ధర ఎంతంటే?
- Skoda Kylaq Sportline: భారత్‌లో కొత్త స్కోడా కైలాక్ స్పోర్ట్‌లైన్ వేరియంట్ విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 5-స్టార్ సేఫ్టీ
- Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
- Honda CB300F Twister 2027: ఇథనాల్ ఇంజిన్‌తో హోండా CB300F ట్విస్టర్ 2027.. 24.7 CV పవర్, 26.2 Nm టార్క్
Also Read: Rohit-Kohli: 1, 3 స్థానాలు ఇప్పటికే ఫిక్స్.. 2027 వన్డే వరల్డ్‌కప్‌లో రో-కో!
కంపెనీ ప్రకారం.. మోంట్రా E-27 ఎలక్ట్రిక్ ట్రాక్టర్ చాలా తక్కువ శబ్దం, కంపనలను కలిగి ఉంటుంది. ఇది ఆపరేటర్‌కు (డ్రైవర్) ఎక్కువ సౌకర్యాన్ని అందిస్తుంది. డ్రైవర్ ఎక్కువ గంటలు పని చేసినా అలసట ఉండదని కంపనీ పేర్కొంది. ఇది మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ద్వారా 27 HP శక్తిని, 90 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పొలాల్లో దున్నడం, పిచికారీ చేయడం, ట్రాలీ పనుల కోసం చాలా ఈ ట్రాక్టర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ట్రాక్టర్ 22.37 kWh LFP ప్రిస్మాటిక్-సెల్ బ్యాటరీ ప్యాక్ ద్వారా రన్ అవుతుంది. ఇది దాదాపు 4.5 గంటల రన్‌టైమ్‌ను అందిస్తుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 2.15 గంటలు పడుతుంది. డీజిల్ ట్రాక్టర్‌తో పోలిస్తే.. దీని నిర్వహణ వ్యయం దాదాపు 70 శాతం తగ్గుతుందని కంపెనీ తెలిపింది.
తాజావార్తలు
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
-
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్‌కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
-
OTT : డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్‌బస్టర్!
ట్రెండింగ్
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్‌ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!