NTV Telugu Site icon

MG ZS EV ADAS: న్యూ అవతార్‌లో ఎంజీ జెడ్ఎస్ ఈవీ.. కొత్తగా అడాస్ ఫీచర్లతో లాంచ్..

Mg Zs Ev Adas

Mg Zs Ev Adas

MG ZS EV ADAS: ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఇండియాలో నెక్సాన్ తరువాత ఎక్కువ అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ఎస్ యూ వీల్లో ఎంజీ జెడ్ఎస్ ఈవీ తర్వాతి స్థానంలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఎంజీ జెడ్ఎస్ ఈవీని మరిన్ని ఫీచర్లతో లాంచ్ చేసింది. ఇటీవల కాలంలో వినియోగదారులు ఎక్కువగా ADAS( అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టింగ్ సిస్టమ్)తో కోరుకుంటున్న నేపథ్యంలో ఎంజీ జెడ్ఎస్ ఈవీని అడాస్ ఫీచర్లతో తీసుకువచ్చింది.

ఎంజీ మోటార్ ఇండియా దేశంలో లెవల్-2 ADAS ఫీచర్లని జెడ్ఎస్ ఈవీ కార్ లో ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇప్పటికే మిడ్ సైజ్ ఎస్ యూ వీ అయిన ఎంజీ ఆస్టర్ కారులో ADAS ఫీచర్లను తీసుకువచ్చింది ఈ కంపెనీ. తాజాగా జెడ్ఎస్ ఈవీలో కూడా ఈ సాంకేతికతను జోడించింది. 2020 జనవరిలో మార్కెట్ లోకి వచ్చిన ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఇప్పటి వరకు 10,000 యూనిట్లకు పైగా అమ్ముడైంది.

ధర ఎంతంటే..?

మొత్తం మూడు వేరియంట్లలో ఈ కారు రాబోతోంది. ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌క్లూజివ్ ప్రో వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వేరియంట్ వారీగా ధరల్ని పరిశీలిస్తే ఎక్స్ -షోరూం ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ZS EV ఎక్సైట్ – రూ. 23.38 లక్షలు
ZS EV ఎక్స్‌క్లూజివ్ – రూ. 27.30 లక్షలు
ZS EV ఎక్స్‌క్లూజివ్ డ్యూయల్ టోన్ – రూ. 27.40 లక్షలు
ZS EV ఎక్స్‌క్లూజివ్ ప్రో – రూ. 27.90 లక్షలు
ZS EV ఎక్స్‌క్లూజివ్ ప్రో డ్యూయల్ టోన్ – రూ. 28 లక్షలు

ఫీచర్లు ఇవే..

ADAS లెవల్ 2తో వస్తున్న ఈ కారు మూడు లెవల్స్ లో పనిచేస్తుంది. ఇది అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బెండ్ క్రూయిజ్ అసిస్టెన్స్, ట్రాఫిక్ జామ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఎమర్జెన్సీ లేన్ కీప్, లేన్ కీప్ అసిస్ట్, ఫ్రంట్ కొలైడ్ వార్నింగ్, టోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ – పాదచారులు, ఇంటెలిజెంట్ హైడ్రాలిక్ బ్రేకింగ్ అసిస్టెన్స్, ఇంటెలిజెంట్ హెడ్‌ల్యాంప్ కంట్రోల్ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇన్ఫర్మేషన్ మోడ్, మాన్యువల్ మోడ్, ఇంటెలిజెంట్ మోడ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ సిస్టమ్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్ , లేన్ చేంజ్ అసిస్ట్ వంటి అడాస్ ఫీచర్లు కొత్త ఎంజీ జెడ్ ఎస్ ఈవీలో ఉన్నాయి.

పర్మినెంట్ మాగ్నెట్ మోటార్, 50.3kWh సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఎలక్ట్రిక్ మోటార్ 176.75 పీఎస్ పవర్, 280 ఎన్ఎం టార్క్ ఇస్తుంది. ఒక్క ఛార్జింగ్ తో ఏకంగా 461 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. 7.4 కిలోవాట్ చార్జర్ తో 9 గంటల్లో 0-100 పర్సంటేజ్ ఛార్జింగ్ చేయవచ్చు. అదే విధంగా 50 కిలోవాట్ చార్జర్ తో గంటలో 0-80% ఛార్జింగ్ చేయవచ్చు.

ఎంజీ జెడ్ఎస్ ఈవీ టాప్ ఫీచర్లలో ఫుల్-LED హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్‌ల్యాంప్‌లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-అంగుళాల HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. 75కి పైగా కనెక్టవిటీ ఫీచర్ల జెడ్ఎస్ ఈవీ సొంతం. గ్లేజ్ రెడ్, అరోరా సిల్వర్, స్టార్రీ బ్లాక్, కాండీ వైట్ అనే నాలుగు కలర్స్ లో ఈ కార్ లభ్యమవుతుంది. మార్కెట్ లో ఉన్న హ్యుందాయ్ కోనా, బీవడీ అటో 3 కార్లకు ఎంజీ జెడ్ఎస్ ఈవీ గట్టి పోటీ ఇవ్వనుంది.