NTV Telugu Site icon

Maruti Swift CNG Price 2023: కేవలం 1 లక్ష చెల్లించి.. మారుతీ స్విఫ్ట్ సీఎన్‌జీని ఇంటికి తీసుకెళ్లండి! మైలేజ్ 30 కిమీ

Maruti Swift

Maruti Swift

Maruti Swift CNG Price 2023: మీకు కొత్త కారు కొనాలనే కల ఉందా?.. అందులోనూ మంచి సీఎన్‌జీ కారును కొనాలనుకుంటున్నారా?. మీకు ఓ మంచి ఆప్షన్ ఉంది. ‘మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీ’ మీకు ఉత్తమమైన ఎంపిక. ఎందుకంటే ప్రతి నెలా మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీ అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.99 లక్షల నుంచి రూ.9.03 లక్షల వరకు ఉంది. గత సంవత్సరం రెండు వేరియంట్‌లలో (Maruti Swift ZXI CNG మరియు Maruti Swift VXI CNG) మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ విడుదల అయింది.

Maruti Swift VXI CNG Mileage:
విశేషమేమిటంటే మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీ లుక్ అద్బుతంగా ఉంది. అంతేకాదు ఈ మైలేజ్ పరంగా కూడా ఉత్తమ ఎంపిక. మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీ 30.9 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. మీరు ఈ కారుని ఫైనాన్స్ ద్వారా కేవలం రూ. 1 లక్షతో మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు. కేవలం రూ. 1 లక్ష డౌన్‌పేమెంట్ చేసి.. మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీ యొక్క ఏ వేరియంట్‌ని అయినా కొనుగోలు చేయవచ్చు. ఆ పూర్తి వివరాలు ఇపుడు చూద్దాం.

Also Read: Balakrishna New Movie: బాలకృష్ణ కొత్త సినిమా.. స్టార్ హీరోయిన్‌కు ఛాన్స్! ఇది నాలుగోసారి

Maruti Swift VXI CNG Price and EMI Calculation:
మారుతి సుజుకి స్విఫ్ట్ వీఎక్స్ఐ సీఎన్‌జీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.85 లక్షలు. ఈ కారు ఆన్-రోడ్ ధర దాదాపుగా 9 లక్షలుగా ఉంది. అయితే మీరు కేవలం రూ. 1 లక్ష డౌన్‌పేమెంట్ చెల్లించి.. రూ. 7 లక్షల 95 వేల 19 రుణం తీసుకోవాలి. అప్పుడు 9 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాల పాటు రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా 16 వేల 503 రూపాయల ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ఐదు సంవత్సరాలకు సుమారు రూ. 2 లక్షల వడ్డీ అవుతుంది.

Maruti Swift ZXI CNG Price and EMI Calculation:
మారుతి సుజుకి స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ సీఎన్‌జీ ఎక్స్-షోరూమ్ ధర రూ.8 లక్షల 53 వేలు. ఆన్-రోడ్ ధర రూ.9 లక్షల 70 వేల 530. మీరు కేవలం రూ. 1 లక్ష డౌన్‌పేమెంట్ చెల్లించి.. స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ సీఎన్‌జీని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. బ్యాంకు నుంచి రూ.8 లక్షల 70 వేల 530 రుణం తీసుకోవాలి. ఈ రుణాన్ని 5 సంవత్సరాల వ్యవధిలో తిరిగి చెల్లించాలి. దీనిపై వడ్డీ రేటు 9 శాతం ఉండగా.. ప్రతి నెలా 18 వేల 71 రూపాయలు చెల్లించాలి. ఈ కారుకు మీరు వడ్డీగా రూ.2.13 లక్షలు చెల్లించాలి.

Also Read: Garlic Side Effects: వెల్లుల్లి ఎక్కువగా తింటున్నారా?.. ఈ అనారోగ్య సమస్యలు తప్పవు!

Show comments