NTV Telugu Site icon

Maruti Cars: మారుతి వ్యాగన్ ఆర్ కొనాలనుకుంటున్నారా.. కొన్ని రోజులు ఆగాల్సిందే..!

Maruti Wagon R

Maruti Wagon R

భారత మార్కెట్లో ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు మారుతి సుజుకి.. గత కొన్ని నెలల్లో పలు వాహనాల ధరలను పెంచింది. వీటిలో హ్యాచ్‌బ్యాక్ విభాగంలో బాగా పాపులర్ అయిన మారుతి వ్యాగన్ ఆర్ ధరలు కూడా పెరిగాయి. ఇది 2025 ఫిబ్రవరి నెలలో జరిగింది. కస్టమర్ల కోసం ఈ కొత్త ధరలు ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టారు. మారుతి సుజుకి తన వ్యాగన్ ఆర్ యొక్క ధరను 15,000 రూపాయల వరకు పెంచింది. మారుతి కంపెనీలో కొన్ని వేరియంట్ల ధరలు 10,000 రూపాయల వరకూ పెరిగాయి.

Read Also: Redmi Book Pro: రెడ్ మీ నుంచి ప్రీమియం ల్యాప్ టాప్.. త్వరలో మార్కెట్‌లోకి

ఏ వేరియంట్ల ధరలు పెరిగాయి..
మారుతి పాపులర్ వేరియంట్లలో VXI 1.0 AGS, ZXI 1.2 AGS, ZXI+ 1.2 AGS, ZXI+ AGS డ్యూయల్ టోన్ వేరియంట్ల ధరలు 15,000 రూపాయలు పెరిగాయి. మిగతా అన్ని వేరియంట్ల ధరలు 10,000 రూపాయల వరకు పెరిగాయి. మారుతి వ్యాగన్ ఆర్ తాజా ధరల విషయానికొస్తే..
బేస్ వేరియంట్ (LXI): ₹5.64 లక్షలు (ఎక్స్-షోరూమ్)
VXI: ₹6.09 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ZXI: ₹6.38 లక్షలు (ఎక్స్-షోరూమ్)
LXI CNG: ₹6.54 లక్షలు (ఎక్స్-షోరూమ్)
VXI AGS: ₹6.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ZXI+: ₹6.85 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ZXI AGS: ₹6.88 లక్షలు (ఎక్స్-షోరూమ్)
VXI CNG: ₹6.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ZXI+ AGS: ₹7.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)

పోటీ ఎవరు..?
మారుతి వ్యాగన్ ఆర్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రధాన వాహనాలతో పోటీ పడుతుంది. ఈ విభాగంలో మారుతి సెలెరియో, ఎస్ ప్రెస్సో, రెనాల్ట్ క్విడ్, హ్యుందాయ్ గ్రాండ్ నియోస్ ఐ10 వంటి హ్యాచ్‌బ్యాక్ కార్లు పోటీగా ఉన్నాయి. అలాగే.. టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ వంటి SUV లతో కూడా వ్యాగన్ ఆర్ పోటీ పడుతుంది. అయితే.. ఈ ధరల పెరుగుదల ప్రధానంగా మార్కెట్లో రాబోయే వ్యూహాలు, కొత్త వాహనాల తయారీ ఖర్చుల పెరుగుదల కారణంగా జరుగుతున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2025లో వాహనదారుల ఆర్థిక పరిస్థితి, మార్కెట్ డిమాండ్‌ను బట్టి ఈ ధరల పెరుగుదల అనేక మారుతి కస్టమర్లపై ప్రభావం చూపిస్తుంది.