Maruti Suzuki July 2026 Offers: మారుతి సుజుకి కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి జూలై 2026 నెల సూపర్ గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. తన అరేనా (Arena), నెక్సా (Nexa) డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లలోని సెలెక్టెడ్ హ్యాచ్‌బ్యాక్‌లు, ఎస్‌యూవీలు, ఎమ్‌పీవీలపై కంపెనీ ఏకంగా రూ. 2.10 లక్షల వరకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ జూలై ఆఫర్లలో భాగంగా కస్టమర్లకు కన్స్యూమర్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ బెనిఫిట్స్, స్క్రాపేజ్ ఇన్సెంటివ్‌లు, కార్పొరేట్ స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. వ్యాగన్ఆర్, స్విఫ్ట్, బ్రెజ్జా, బాలెనో, గ్రాండ్ విటారా, ఇన్విక్టో వంటి పాపులర్ మోడల్స్ అన్నింటిపై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఈ నెల మారుతి సుజుకి కార్లలో అన్నింటికంటే అత్యధికంగా ఇన్విక్టో (Invicto MPV) మోడల్‌పై రూ. 2.10 లక్షల వరకు భారీ లబ్ధి చేకూరనుంది. కన్స్యూమర్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్, కార్పొరేట్ డిస్కౌంట్ల కలయిక ద్వారా ఈ బెనిఫిట్ లభిస్తుంది. అలాగే ఎస్‌యూవీ ప్రియులను ఆకట్టుకునే గ్రాండ్ విటారాపై కూడా అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. దీని పెట్రోల్ వేరియంట్లపై రూ. 95,000 వరకు, సీఎన్‌జీ వెర్షన్లపై రూ. 90,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్‌కు రోడ్ టాక్స్ పూర్తిగా మినహాయింపు ఉండటంతో పాటు, ఎక్స్ఛేంజ్, లాయల్టీ బెనిఫిట్స్ ఉచితంగా ఐదేళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా లభిస్తోంది.
కంపెనీ అరేనా పోర్ట్‌ఫోలియో విషయానికి వస్తే.. విక్టోరిస్ (Victoris SUV) మోడల్‌పై భారీ ఆఫర్లు ఉన్నాయి. దీని హైబ్రిడ్ వేరియంట్‌పై రూ. 90,000 వరకు, సీఎన్‌జీ వెర్షన్‌పై రూ. 80,000 వరకు, పెట్రోల్ వేరియంట్‌పై రూ. 60,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. మారుతి మాస్-మార్కెట్ మోడల్స్ లో అత్యంత పాపులర్ అయిన బ్రెజ్జా ఎస్‌యూవీపై ఈ నెల రూ. 55,000 వరకు తగ్గింపు ఉండటం విశేషం. మారుతి సుజుకి కార్లలో అత్యధికంగా అమ్ముడయ్యే హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా నిలిచిన వ్యాగన్ఆర్‌పై రూ. 52,500 వరకు ఆఫర్లు ఉండగా, సెలెక్టెడ్ ఆల్టో కె10 వేరియంట్లపై కూడా ఇవే రకమైన బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. కొత్తగా స్విఫ్ట్ కార్ కొనాలనుకునే వారు ఏజీఎస్ (AGS) వేరియంట్లపై రూ. 45,000 వరకు, మాన్యువల్ పెట్రోల్ సీఎన్‌జీ వెర్షన్లపై రూ. 40,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. వీటితో పాటు సెలెరియో, ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్‌లు ఈకో (Eeco) వ్యాన్‌లపై వేరియంట్లను బట్టి రూ. 37,500 వరకు ఆఫర్లు ఉన్నాయి.
ఇక ప్రీమియం నెక్సా శ్రేణి కార్లలో.. బాలెనో హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 40,000 వరకు ఆఫర్లు లభిస్తుండగా, ఫ్రాంక్స్ (Fronx) ఎస్‌యూవీ టర్బో-పెట్రోల్ వేరియంట్‌పై రూ. 25,000 వరకు, నార్మల్ పెట్రోల్ వెర్షన్‌పై రూ. 15,000 వరకు తగ్గింపు ఉంది. ఎక్స్‌ఎల్6 (XL6) పెట్రోల్ సీఎన్‌జీ వేరియంట్లపై, అలాగే జిమ్నీ ఎస్‌యూవీపై రూ. 45,000 వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అయితే ఇక్కడ కస్టమర్లు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. బాలెనో, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఎక్స్‌ఎల్6 వంటి నెక్సా మోడల్స్‌పై కన్స్యూమర్ డిస్కౌంట్లు జూలై 16 నుంచి తగ్గనున్నాయి. అంటే జూలై 15 లోపు కార్ బుక్ చేసుకునే వారికే బెస్ట్ డీల్స్ దక్కుతాయి. అయితే జిమ్నీ, ఇన్విక్టో మోడళ్లపై మాత్రం ఈ నెల చివరి వరకు పాత ఆఫర్లే కొనసాగుతాయి. ఎప్పటిలాగే కస్టమర్‌కు లభించే తుది డిస్కౌంట్ అనేది ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, లాయల్టీ కార్పొరేట్ స్కీమ్‌ల అర్హతపై ఆధారపడి ఉంటుంది. చాలా సందర్భాలలో కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్లలో ఏదో ఒకటి మాత్రమే పొందగలరు. అలాగే లాయల్టీ బెనిఫిట్స్ అనేవి కంపెనీ నిర్దేశించిన కొన్ని ప్రత్యేక నిబంధనలకు లోబడి మాత్రమే వర్తిస్తాయి.

